ఎక్స్‌ప్రెస్ రాజా | |
---|---|
దర్శకత్వం | మేర్లపాక గాంధీ |
రచన | మేర్లపాక గాంధీ |
నిర్మాత | వంశీ ప్రమోద్ |
తారాగణం | శర్వానంద్ సురభి |
ఛాయాగ్రహణం | కార్తీక్ ఘట్టమనేని |
సంగీతం | ప్రవీణ్ లక్కరాజు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జనవరి 14, 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎక్స్‌ప్రెస్ రాజా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 2016 లో విడుదలైన చిత్రం. ఇందులో శర్వానంద్, సురభి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు.
రాజా(శర్వానంద్) తండ్రి మాటను లెక్కపెట్టకుండా బాధ్యతలేకుండా తన మావయ్య శీను (ప్రభాస్ శీను)తో కలిసి వైజాగ్‌లో బేవార్సుగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఐతే తన తండ్రి మీద ఉన్న గౌరవంతో ఆయన స్నేహితుడు ఉద్యోగం ఇప్పిస్తే అందుకోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. తీరా అక్కడికి వెళ్లాక ఉద్యోగం చేయకుండా అమూల్య (సురభి) అనే అమ్మాయి వెంట తిరగడం మొదలు పెడతాడు రాజా. మొదట రాజాను అసహ్యించుకున్నా ఆమె కూడా అతడి ప్రేమలో పడుతుంది. ఐతే కుక్కలంటే పడని రాజా అమూల్యకు ఎంతో ఇష్టమైన కుక్కపిల్లను మునిసిపాలిటీ వాళ్లకు పట్టిస్తాడు. దీంతో అమూల్య అతడిని ఛీకొట్టి వెళ్లి పోతుంది. ఇక తన ప్రేయసికి ఎంతో ఇష్టమైన కుక్కను పట్టి తేవడానికి రాజా ఎలాంటి పాట్లు పడ్డాడు అనేది మిగతా కథ.