డాక్టర్ ఎన్. రాజం | |
---|---|
జననం | 1938 (age 85–86) చెన్నై, భారతదేశం |
వృత్తి | వయొలిన్ కళాకారిణి |
పురస్కారాలు |
|
వెబ్‌సైటు | https://nrajam.com/ |
ఎన్. రాజం (జననం 1938 ఏప్రిల్ 8) హిందుస్థానీ శాస్త్రీయ సంగీత రంగానికి చెందిన భారతీయ వయోలిన్ విద్వాంసురాలు. ఆమె బనారస్ హిందూ యూనివర్శిటీలో సంగీతం ప్రొఫెసర్‌గా కెరీర్ మొదలు పెట్టి, డిపార్ట్‌మెంట్ హెడ్‌గా, యూనివర్సిటీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్‌గా ఎదిగింది.
కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా అందించే సంగీతం, నృత్యం, నాటకం వంటి కళలలో అత్యున్నత గౌరవం అయిన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ఆమెకు 2012లో లభించింది.
ఎన్.రాజం 1938లో చెన్నైలో సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి విద్వాన్ ఎ. నారాయణ అయ్యర్ కర్ణాటక సంగీతంలో సుప్రసిద్ధుడు.[1] ఆమె సోదరుడు టి.ఎన్.కృష్ణన్ కర్ణాటక శైలిలో ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు. ఆమె తండ్రి వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణను ప్రారంభించింది. ఆమె ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ వద్ద శిక్షణ పూర్తిచేసింది. గాయకుడు ఓంకార్నాథ్ ఠాకూర్ నుండి ఆమె రాగ వికాసం నేర్చుకుంది.
ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
ఆమె తండ్రి, ఎ. నారాయణ అయ్యర్ మార్గదర్శకత్వంలో ఆమె గయాకి అంగ్ (గాత్ర శైలి)ని అభివృద్ధి చేసింది. భారతదేశం అంతటా అనేక ప్రదేశాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఆమె ఇచ్చింది.
ఆమె దాదాపు 40 ఏళ్లపాటు బనారస్ హిందూ యూనివర్సిటీలో సంగీత విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. అక్కడ, ఆమె డిపార్ట్‌మెంట్ చైర్‌గా, కళాశాల డీన్‌గా పదోన్నతులు పొందింది.
ఆమె తన కుమార్తె సంగీత శంకర్, ఆమె మనవరాల్లు రాగిణి శంకర్, నందిని శంకర్, ఆమె మేనకోడలు కళా రాంనాథ్, ప్రణవ్ కుమార్, ప్రొఫెసర్. వి. బాలాజీ (బి.హెచ్.యు.), డాక్టర్ సత్య ప్రకాష్ మొహంతీ మొదలైనవారు ఆమె విద్యార్థులు.
చార్టర్డ్ అకౌంటెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన టి.ఎస్.సుబ్రమణియన్‌ను ఆమె వివాహం చేసుకుంది. ఆమె అత్తగారు పద్మా స్వామినాథన్, సామాజిక కార్యకర్త, కర్ణాటక సంగీత గాయని.
పద్మా స్వామినాథన్, ఎఫ్.జి.నటేశ అయ్యర్ చివరి కుమార్తె.[2][3] దక్షిణ భారత చలనచిత్ర రంగంలో నేపథ్య గాయని వాణీ జైరామ్ ఆమె కోడలు.
featured her famous musician daughter-in-law Dr N Rajam, her daughter Sangeetha Shankar, and her grandchildren Ragini Shankar and Nandini Shankar giving a brilliant violin concert accompanied by Kedar Kharaton on table. That was followed by another world famous musician Vani Jairam, another daughter-in-law, rendering two compositions.
The two-day celebration of Padma Swaminathan's 100th birthday on 1 December at Brindavan Hill, Coimbatore was attended by her family including (L to R): Nandini Shankar (great granddaughter), Shankar Devraj (Sangita's husband), T.S. Jairam (son) and Vani Jairam, Padma Swaminathan, N. Rajam and T.S. Subramanian (son), Sangita Shankar (granddaughter) and Ragini Shankar (great granddaughter). It was followed by a violin concert by N. Rajam (daughter-in-law) with Sangita, Nandini and Ragini accompanied by Kedar Kharaton (tabla). Vocalist Vani Jairam (daughter-in-law) rendered a few compositions.