దివాన్ బహదూర్ సర్ ఎన్.గోపాలస్వామి అయ్యంగార్ | |
---|---|
2వ రక్షణ మంత్రి (భారతదేశం) | |
In office 1952 మే 13 – 1953 ఫిబ్రవరి 10 | |
అధ్యక్షుడు | రాజేంద్ర ప్రసాద్ |
ప్రధాన మంత్రి | జవహర్‌లాల్ నెహ్రూ |
అంతకు ముందు వారు | బలదేవ్ సింగ్ |
తరువాత వారు | జవహర్‌లాల్ నెహ్రూ |
1వ రాజ్యసభలో సభా నాయకుడు | |
In office 1952 మే 13 – 1953 ఫిబ్రవరి 10 | |
అధ్యక్షుడు | రాజేంద్ర ప్రసాద్ |
ప్రధాన మంత్రి | జవహర్‌లాల్ నెహ్రూ |
అంతకు ముందు వారు | స్థానం ఏర్పాటు చేయబడింది |
తరువాత వారు | చారు చంద్ర బిశ్వాస్ |
రైల్వే & రవాణా మంత్రి | |
In office 1948 సెప్టెంబరు 22 – 1952 మే 13 | |
చక్రవర్తి | కింగ్ జార్జ్ VI (1936-1950) |
అధ్యక్షుడు | రాజేంద్ర ప్రసాద్ |
ప్రధాన మంత్రి | జవహర్‌లాల్ నెహ్రూ |
తరువాత వారు | లాల్ బహదూర్ శాస్త్రి |
జమ్మూ కాశ్మీర్ ప్రధాన మంత్రి | |
In office 1937–1943 | |
చక్రవర్తి | హరి సింగ్ |
తరువాత వారు | కైలాష్ నాథ్ హక్సర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | నరసింహ అయ్యంగార్ గోపాలస్వామి అయ్యంగార్ 1882 మార్చి 31 తంజోర్ జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ సామ్రాజ్యం |
మరణం | 1953 ఫిబ్రవరి 10 మద్రాస్, మద్రాస్ రాష్ట్రం, భారతదేశం (ఇప్పుడు చెన్నై, తమిళనాడు) | (వయసు 70)
నరసింహ అయ్యంగార్ గోపాలస్వామి, (సిఎస్ఐ, సిఐఇ) (1882 మార్చి 31-1953 ఫిబ్రవరి 10) రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు, రాజకీయ నాయకుడు, భారత ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసాడు. మొదట శాఖ కేటాయించని మంత్రిగా నియమించబడ్డాడు. కానీ కాశ్మీర్ వ్యవహారాలను చూసుకోవడం, ఆ తరువాత రైల్వే మంత్రిగా కొనసాగాడు.[1] ఇతనికి దివాన్ బహదూర్ అనే బిరుదు ఉంది.తన కాశ్మీర్ వ్యవహారాల పాత్రలో, అతను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.తరువాత జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని రూపొందించడంలో ప్రముఖ పాత్రవహించాడు.
గోపాలస్వామి అయ్యంగార్ 1882 మార్చి 31న మద్రాస్ ప్రెసిడెన్సీ, తంజోర్ జిల్లా (మద్రాస్ ప్రెసిడెన్సి) లో జన్మించాడు. అతను వెస్లీ పాఠశాలలో, మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో లా చదివాడు. ఆ తర్వాత 1904 లో అతను పచ్చయ్యప్ప కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా స్వల్ప కాలం పనిచేశాడు.
1905లో, అయ్యంగార్ మద్రాస్ సివిల్ సర్వీస్‌లో చేరాడు.అతను 1919 వరకు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశాడు.1920లో కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా పదోన్నతి పొందాడు. అతను 1921 నుండి ఏడు సంవత్సరాల పాటు పంచాయతీల రిజిస్ట్రార్-జనరల్, స్థానిక బోర్డ్‌ల ఇన్స్పెక్టర్‌గా పనిచేశాడు. ఈ సమయంలో రామనాడ్, గుంటూరు జిల్లాలలో అనేక గ్రామ పంచాయితీలు నిర్వహించబడ్డాయి.[2] తర్వాత మూడేళ్లపాటు అతను అనంతపురం జిల్లా కలెక్టరు, మేజిస్ట్రేటుగా, ఆ తరువాత అతను 1932 వరకు మునిసిపల్ కౌన్సిల్స్, స్థానిక బోర్డ్‌ల ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసాడు. అయ్యంగార్ 1932 నుండి 1934 వరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశాడు. చివరగా అతను 1937 వరకు రెవెన్యూ బోర్డు సభ్యుడిగా పనిచేశాడు.
అతని జీవితం రెండవ దశ రాజకీయాలకు అంకితం చేయబడింది.అతను 1937-1943 వరకు జమ్మూ కాశ్మీర్ ప్రధాన మంత్రి పదవి నిర్వహించాడు.1943-1947 వరకు రాష్ట్ర కౌన్సిల్‌గా నియమించబడ్డాడు. ఆ సమయంలో అతను ఆర్మీ ఇండియాలైజేషన్ కమిటీ ఛైర్మనుగా వ్యవహరించాడు.1947-1948 వరకు జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలోని మొదటి మంత్రివర్గంలో పోర్ట్‌ఫోలియో లేకుండా మంత్రిగా పనిచేశాడు. దీని తరువాత 1948-1952 వరకు రైల్వే, రవాణా మంత్రి పదవిలో కొనసాగాడు. చివరకు అతను 1952-1953 వరకు రక్షణ మంత్రిగా పనిచేశాడు.[3]
అయ్యంగార్ జమ్మూ, కాశ్మీర్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో (1937-43) అతని రాజకీయ జీవితం ప్రాధాన్యతను సంతరించుకుంది.
1946 డిసెంబరులో జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా సమావేశమైన భారత రాజ్యాంగ సభకు అయ్యంగార్ ఎంపికయ్యాడు. అయ్యంగార్ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన పదమూడు మంది సభ్యుల సంఘంలో అతను ఒక సభ్యుడుగా నియమించబడ్డాడు.[4][5]
1947 అక్టోబరులో జమ్మూ కాశ్మీర్‌లో చేరిన వెంటనే, నెహ్రూ అయ్యంగార్‌ను పోర్ట్‌ఫోలియో లేకుండా క్యాబినెట్ మంత్రిగా నియమించి, కాశ్మీర్ వ్యవహారాలను చూసుకోమని అడిగాడు. అదే సమయంలో నెహ్రూ కాశ్మీర్‌కు మొత్తం బాధ్యతను నిర్వహించాడు.ఈ చర్య అన్ని ఇతర రాచరిక రాష్ట్రాలతో పాటు సాధారణంగా కాశ్మీర్‌కు బాధ్యత వహించాల్సిన హోం మంత్రి వల్లభాయ్ పటేల్‌తో విభేదాలకు కారణమైంది.[4] అయ్యంగార్ స్వాతంత్ర్య సమర యోధుడు.1948లో కాశ్మీర్ వివాదంపై యునైటెడ్ నేషన్స్ లో జరిగిన సమావేశానికి, భారత్ ప్రాతినిధ్య బృందానికి నాయకత్వం వహించాడు.[6] 1952లో జెనీవాలో కాశ్మీర్ సమస్యపై గురించి జరిగిన చర్చలలో ప్రధానమంత్రి నెహ్రూ అతనిని భారతదేశ ప్రతినిధిగా నియమించాడు.[7] అయ్యంగార్ జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రానికి స్థానిక స్వయంప్రతిపత్తిని మంజూరు చేసిన ఆర్టికల్ 370 ముఖ్య ముసాయిదా రూపొందించాడు .[4]
1953 ఫిబ్రవరి 10న అయ్యంగార్ 71 సంవత్సరాల వయస్సులో మద్రాసులో మరణించాడు.అతనికి వారసులుగా అతని భార్య, ఒక కుమారుడు పార్థసారథి, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు అప్పటికి ది హిందూ అసిస్టెంట్ ఎడిటరుగా పనిచేస్తున్నాడు.[3]
ఇతను ఒక ప్రముఖ నిర్వాహకుడు, పౌర సేవకుడు, అయ్యంగార్ 1947 వరకు ఏడు బిరుదులను పొందాడు.ఇందులో దివాన్ బహదూర్ బిరుదు కూడా ఉంది. ఇది బ్రిటిష్ వైస్రాయ్ ప్రదానం చేసిన అత్యున్నత బిరుదు.బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ప్రదానం చేసిన ఇతర బిరుదులు 1935 సిల్వర్ జూబ్లీ, బర్త్‌డే ఆనర్స్ జాబితాలో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (CIE), [8] 1937 పట్టాభిషేకం ఆనర్స్ జాబితాలో ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా (CSI) సహచరుడు, [9] 1941 న్యూ ఇయర్ ఆనర్స్ జాబితాలో నైట్ హుడ్ బిరుదులు పొందాడు.[10]
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
Media related to ఎన్.గోపాలస్వామి అయ్యంగార్ at Wikimedia Commons