ఎన్.జి.కె. (2019 సినిమా)

ఎన్.జి.కె.
నంద గోపాల కృష్ణ
దర్శకత్వంసెల్వరాఘవన్
రచనసెల్వ రాఘవన్
నిర్మాతఎస్‌ ఆర్ ప్రభు , కేకే రాధా మోహన్
తారాగణం
ఛాయాగ్రహణంశివకుమార్ విజయన్
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
డ్రీమ్ వారియర్ పిక్చర్స్
పంపిణీదార్లురిలయన్స్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
31 మే 2019 (2019-05-31)
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎన్.జి.కె. 2019లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్‌ సినిమా. సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2019, మే 31న విడుదలైంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళంలో విడుదల చేశారు.[1][2]

నంద గోపాల కృష్ణ అలియాస్ ఎన్‌జీకే (సూర్య) అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేస్తాడు. మంచి ఉద్యోగంలో చేరినా దానిలో సంతృప్తి లేకపోవడంతో సొంతూరికి వచ్చి సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్) చేస్తాడు. కొంత మంది స్నేహితులతో కలిసి దీనిపై రైతుల్లో అవగాహన కల్పిస్తూ ఉంటాడు. ఎన్‌జీకే చేసే పని నచ్చక కొంత మంది పురుగుల మందు వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు కలిసి అతనికి వార్నింగ్ ఇస్తారు. వెంటనే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఆపేయాలని హెచ్చరిస్తారు. దీంతో ఎన్‌జీకే స్థానిక ఎమ్మెల్యే పెంచలయ్య సాయం కోరతాడు. ఎన్‌జీకేకు ఊళ్లో మంచి పలుకుబడి ఉండటంతో తన సహాయానికి ప్రతిఫలంగా పార్టీలో చేరాలని ఎన్‌జీకేకు పెంచలయ్య షరతు పెడతాడు. ఒక కార్యకర్తగా మొదలై పార్టీలో బలమైన నాయకుడిగా సూర్య ఎలా ఎదగగలిగాడు? తన ఎత్తులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనేది కథ.[3]

నటీనటులు \ సినిమాలో పాత్ర పేరు

[మార్చు]
  • సూర్య - నంద గోపాల కృష్ణ (N. G. K.)
  • సాయి పల్లవి - గీత కుమారి, నంద గోపాల కృష్ణ భార్య
  • రకుల్ ప్రీత్ సింగ్ - వ‌నిత‌ త్యాగరాజన్, నంద గోపాల కృష్ణ కార్పోరేట్ పీఆర్వోగా
  • దేవరాజ్ - కిళ్ళీవజవాన్, మాజీ ముఖ్యమంత్రిగా
  • పోన్ వణ్ణన్ - పిచాయ్ ముత్తు
  • నిళల్‌గల్ రవి - రామనాన్, నంద గోపాల కృష్ణ తండ్రి
  • ఉమా ప‌ద్మ‌నాభ‌న్ - విజి , నంద గోపాల కృష్ణ తల్లి
  • రాజ్ కుమార్ - రాజా , కుమారన్ మిత్రుడు
  • ఇళవరసు - ఎమ్మెల్యే పాండియన్
  • బాల సింగ్ - అరుణ గిరి
  • వేలా రామమూర్తి - రామమూర్తి
  • తలైవాసల్ విజయ్ - సగాయం
  • గోపి కణ్ణదాసన్ - మంత్రి కేశవమూర్తి
  • సతీష్ - కిళ్ళీవజవాన్ పి.ఎస్
  • శాంతి మని - శ్రీవిల్లిపుత్తూర్ గ్రామస్థురాలిగా
  • కంభం మీనా సెల్లముతు - సెల్వి
  • కార్తీగై సెల్వన్ - న్యూస్ రీడర్
  • ముథాజగన్ - కుమారన్ మిత్రుడు

సినిమాలోని పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందించగా, శ్రేయ ఘోషాల్, సిద్ శ్రీరామ్, రంజిత్, హేమాంబిక పాటలు పాడారు.[4]

సం.పాటపాట రచయితగాయని \ గాయకులుపాట నిడివి
1."‘వడ్డీలోడు వచ్చెనే"చంద్రబోస్సత్యం03:38
2."‘తిరగబడు తిరగబడు’"చంద్రబోస్జితిన్ రాజ్03:56
3."‘ప్రేమా ఓ ప్రేమా’"చంద్రబోస్సిడ్ శ్రీరామ్, హేమాంబిక04:30
4."‘అణచివేసిన’"రాజేష్ ఎ.మూర్తిశరత్ సంతోష్02:04

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (31 May 2019). "సూర్య 'ఎన్జీకే' రివ్యూ - TV9 Telugu Suriya's NGK Review". Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Week (31 May 2019). "'NGK' review: Suriya's standout performance cannot save this muddled film". Retrieved 21 April 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. News18 Telugu (31 May 2019). "NGK Movie Review : సూర్య NGK మూవీ రివ్యూ." Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Yuvan Shankar Raja reworks on 'NGK' album". TimesofIndia.