ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది.[1] [2] 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పురస్కారం గౌరవ నంది పురస్కారం. ఈ పురస్కారం భారతీయ సినిమా నటులు, దర్శకులు, నిర్మాత, రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారి గౌరవార్థం యివ్వబడుతుంది. ఈ పురస్కారం నకు నగదుగా రూ. 500,000, మెమెంటో యివ్వబడుతుంది.[2][3]