ఎర్నాకుళం-కాయంకుళం తీర రైలు మార్గం | |||
---|---|---|---|
అవలోకనం | |||
రకము (పద్ధతి) | ప్రాంతీయ రైలు మార్గం లైట్ రైల్ | ||
స్థితి | పనిచేస్తోంది | ||
లొకేల్ | కేరళ | ||
చివరిస్థానం | ఎర్నాకుళం జంక్షను కాయంకుళం జంక్షను | ||
స్టేషన్లు | 20 | ||
సేవలు | 1 | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | 16 అక్టోబరు 1989 | ||
యజమాని | భారతీయ రైల్వేలు | ||
నిర్వాహకులు | దక్షిణ రైల్వే | ||
సాంకేతికం | |||
లైన్ పొడవు | 102 కి.మీ. (63 మై.) | ||
ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||
ఆపరేటింగ్ వేగం | 100 km/h (62 mph) | ||
|
ఎర్నాకులం-కాయంకుళం తీర రైలు మార్గము భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని అలప్పుజా, ఎర్నాకులం జిల్లాల తీరప్రాంతాల వెంబడి నడిచే రైలు మార్గం. కోస్టల్ రైల్వే లైన్ ఎర్నాకులం జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి అలప్పుజ వైపు బ్రాంచ్ లైన్‌గా ప్రారంభమై, కాయంకుళం జంక్షన్ వద్ద కొట్టాయం (ఎర్నాకులం-కొట్టాయం-కాయంకుళం లైన్ ) ద్వారా ఈ మార్గంతో కలుస్తుంది. కేరళలో ఇంకా డబ్లింగు చేయని ఏకైక ప్రధాన ట్రాక్ ఇదే. సింగిల్ లైన్ కారణంగా ఈ మార్గంలో పెద్ద జాప్యాలు జరుగుతుంటాయి. తీర మార్గం మొత్తం దూరం 102 కి.మీ. (63 మై.) .
అలప్పుజ మీదుగా ఎర్నాకులం-కాయంకుళం లైన్ కోసం ప్రాథమిక సర్వే 1975లో ప్రారంభమైంది. ఎర్నాకుళం జంక్షన్ నుండి అలప్పుజ వరకు రైల్వే లైన్ యొక్క ప్రాథమిక ప్రతిపాదిత అలైన్‌మెంటుకు వ్యవతిరేకంగా వివిధ వర్గాల నుండి నిరసనలు రావడంతో తరువాత దాన్ని మార్చారు. ఈ లైను 1977-78 చివరి బడ్జెట్‌లో ప్రస్తావించబడింది. [1] అంతిమంగా ఎర్నాకులం- కొంతురుటి - నెట్టోర్ - కుంబళం -అరూర్-చేర్తల-అలప్పుజా ల గుండా ఈ మార్గపు చివరి అలైన్‌మెంట్ ఆమోదం పొందింది. 1979 ఏప్రిల్ 15న రైలు మార్గ నిర్మాణం మొదలైంది. ఎర్నాకులం-అలప్పుజా రీచ్, అలప్పుజా-కాయంకుళం రీచ్‌గా రెండు రీచ్‌లుగా విభజించబడింది. [2]
ఎర్నాకులం జంక్షన్ - అలప్పుజ రైల్వే స్టేషన్ విభాగంలో మార్గ నిర్మాణం 1979లో ప్రారంభమైంది. అలెప్పీ-ఎర్నాకులం కొత్త BG రైల్వే లైన్ నిర్మాణాన్ని 1979-80 బడ్జెట్‌లో చేర్చారు. [3] రైల్వే లైన్ల ఏర్పాటు కోసం దాదాపు 140 హెక్టార్ల భూమిని సేకరించారు. ఈ మార్గంలో 11 కొత్త రైల్వే స్టేషన్లు, 6 ప్రధాన వంతెనలను నిర్మించారు. అరూర్ బ్రిడ్జి 1,849 మీ. (6,066 అ.) పొడవుతో ఈ విభాగంలో అతి పొడవైన వంతెన. మొత్తం ఖర్చు వ్యయం 7 కోట్లు, రైల్వే లైన్ మొత్తం పొడవు 58 కి.మీ. (36 మై.) . 1989 అక్టోబరు 16న ఈ మార్గం రైల్వే ట్రాఫిక్‌కు తెరవబడింది.
కోస్టల్ రైల్వే డెవలప్‌మెంట్ రెండవ దశలో భాగంగా అలప్పుజ-కాయంకుళం సెక్షన్ నిర్మాణం మొదలైంది. అలప్పుజ - పున్నప్రా - అంబలప్పుజ - హరిపాడ్ - కాయంకుళం మీదుగా అలైన్‌మెంటు నడిచింది. రైల్వే లైన్ మొత్తం పొడవు 44 కి.మీ. (27 మై.). ఈ మార్గం 1992లో రైల్వే ట్రాఫిక్‌కు తెరవబడింది. ఈ విధంగా, ఎర్నాకులం జంక్షన్ - అలప్పుజా తీర రైల్వే లైన్ కాయంకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ - కొల్లం జంక్షన్ ప్రధాన రైలు మార్గానికి అనుసంధానించబడింది.
ఈ మార్గంలో 18 స్టేషన్లు ఉన్నాయి. అలప్పుజ, చేరాల, హరిపాడ్, అంబలప్పుళ లు వీటిలో ప్రధానమైనవి.
ఎర్నాకులం జంక్షన్ - అలప్పుజ - కాయంకుళం రైలు మార్గం పూర్తిగా విద్యుదీకరించబడింది. కాయంకుళం- హరిపాడ్ సెక్షనులో 14 కి.మీ. (8.7 మై.) మేర డబుల్ లైన్ పనులు పూర్తయ్యాయి. డబుల్ లైన్ ట్రాక్ 2012 జనవరిలో ప్రారంభించబడింది. హరిపాడు-అంబలపూజ కోసం ట్రాక్ డబ్లింగ్ పనులు కూడా మొదలయ్యాయి. ఆ విధంగా కాయంకుళం నుండి అంబలపుజ వరకు డబుల్ లైన్ ఏర్పడింది. 1,849 మీ. (6,066 అ.) డబ్లింగు చేసిన లాంగ్ అరూర్ వంతెన 2019లో ప్రారంభమైంది.