ఎర్ర బస్సు (సినిమా)

ఎర్ర బస్సు
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనరాజేంద్ర కుమార్ (మాటలు)
కథయన్. రాఘవన్
నిర్మాతదాసరి నారాయణరావు
తారాగణంమంచు విష్ణు,
కేథరీన్ థెరీసా
ఛాయాగ్రహణంఅంజి
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లు24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ (ప్రపంచవ్యాప్తంగా) [2]
విడుదల తేదీ
14 నవంబరు 2014 (2014-11-14)[1]
దేశంఇండియా
భాషతెలుగు

ఎర్ర బస్సు 2014 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇది దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 151వ చిత్రం. రాజ్‌కిరణ్, విమల్ తాతా మనవళ్ళుగా నటించిన తమిళ సినిమా మంజాపై ఆధారంగా ఈ సినిమాను రీమేక్ చేశారు.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

ఏయ్ చల్లగాలి చల్లగాలి , రచన: భాస్కర భట్ల రవికుమార్ ,గానం. వేణు శ్రీరంగం, శ్రావణ భార్గవి

ఒంటరిగా నువ్వుంటే , రచన: దాసరి నారాయణరావు, గానం.విజయ్ ఏసుదాస్ ,

ఓం నమో నమో , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.సింహా

అయ్యో అయ్యో తాతయ్య , రచన: కరుణాకరన్, గానం సుస్వర జస్విర , మధురస్వర

నవ్వమ్మ తల్లి నవ్వమ్మా , రచన: సుద్దాలఅశోక్ తేజ , గానం.ఎం ఎం కీరవాణి

ఆకాశాన పుడుతాడు , రచన: దాసరి నారాయణరావు, గానం.గానం.విజయ్ ఏసుదాస్.

రాజేశ్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో తాతయ్య నారాయణస్వామి దగ్గరే పెరుగుతాడు. పెద్దవాడైన తర్వాత సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటాడు. అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరవడాలన్నది రాజేశ్ కోరిక. ఓ రోజు రోడ్డుమీద రాజీ అనే అమ్మాయిని చూసి తొలిచూపు ప్రేమలో పడతాడు. డెంటిస్ట్ అయిన రాజీ హౌస్‌సర్జన్ చేస్తుంటుంది. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలుచేసి మొదట ఆమె ఆగ్రహానికి గురైనా... ఆపైన అనుగ్రహం సంపాదిస్తాడు. ఇంతలో అతనికి అమెరికా వెళ్ళే అవకాశం వస్తుంది. అమెరికా వెళ్ళిపోయేలోపు తాతయ్యను తన దగ్గరే ఉంచుకునేందుకు పాలకొల్లు నుండి హైదరాబాదుకు తీసుకొస్తాడు. ఆధునిక సాంకేతిక వనరుల గురించి అవగాహనలేని ఆ పల్లెటూరి తాతయ్య ఈ నగరంలో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు? ముక్కుసూటితనం వల్ల ఆయన ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు?? అన్నది మిగతా కథ.[4]

స్పందనలు

[మార్చు]
  • తాతయ్యగా దాసరి నటన బాగానే ఉంది. అయితే భారీ శరీరం కారణంగా ఆయన మీద సానుభూతి ఏ కోశాన ప్రేక్షకులకు కలగని పరిస్థితి ఏర్పడింది. మంచు విష్ణు సినిమా ప్రారంభంలో తన తండ్రిని అనుకరిస్తూ సంభాషణలు చెప్పాలని ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత తనదైన తరహాలో రాజేశ్ పాత్రలో లీనమైపోయాడు. ఇక కేథరిన్ అయితే... తన ఓవర్ యాక్షన్తో చికాకు తెప్పించేసింది. కృష్ణుడు, మేల్కొటే మధ్య చిత్రీకరించిన హాస్పటల్ కామెడీసీన్ కూడా పరమ చెత్తగా ఉంది. దానితో పాటు 'ఐ డోంట్ నో' కామెడీ ఎపిసోడ్ కూడా పేలలేదు. బ్రహ్మానందంపై కాకులు కక్షకట్టే సన్నివేశం కంటే కూడా నెమలి కంటే కాకి ఎలా గొప్పదో దాసరి చెప్పిన తీరు బాగుంది. చక్రి సమకూర్చిన బాణీలు, నేపథ్య సంగీతం బాగానే ఉన్నాయి. కానీ తాత మనవళ్ళ మధ్య అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపడంలోనూ, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను ఆసక్తికరంగా తెరకెక్కించడంలోనూ దాసరి విఫల మయ్యాడు. దాంతో ఈ 'ఎర్రబస్సు' ప్రయాణం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని మిగల్చ లేకపోయింది![4] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్, సినీ జర్నలిస్ట్

మూలాలు

[మార్చు]
  1. "Archived copy". Archived from the original on 30 October 2014. Retrieved 3 September 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "24 frames factory bags 'Erra Bus' worldwide release rights". IndiaGlitz. 11 November 2014. Archived from the original on 23 నవంబరు 2014. Retrieved 3 September 2019.
  3. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
  4. 4.0 4.1 చంద్రం (24 November 2014). "సాఫీగా సాగని ఎర్రబస్సు ప్రయాణం". జాగృతి వారపత్రిక. Retrieved 19 February 2024.