వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఎర్విన్ బ్రూస్ మెక్‌స్వీనీ | ||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వెల్లింగ్టన్, న్యూజీలాండ్ | 1957 మార్చి 8||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ | ||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 51) | 1986 జనవరి 9 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1987 మార్చి 28 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 25 |
ఎర్విన్ బ్రూస్ మెక్‌స్వీనీ (జననం 1957, మార్చి 8) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు. 1980లలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా 16 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]
1984-85లో యంగ్ న్యూజీలాండ్ జట్టుతో కలిసి జింబాబ్వేలో పర్యటించాడు. న్యూజీలాండ్ సీనియర్ జట్టుతో కలిసి అతను 1985-86లో ఆస్ట్రేలియా,[2] 1986-87లో శ్రీలంకలో పర్యటించాడు. 1985–86లో షార్జాలో ఆస్ట్రేలియన్-ఆసియా వన్డే సిరీస్‌లో ఆడాడు.
మెక్‌స్వీనీ 1979-80, 1993-94 మధ్యకాలంలో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, వెల్లింగ్టన్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1987-88లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌పై వెల్లింగ్‌టన్ తరఫున గావిన్ లార్సెన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 341 పరుగులు జోడించినప్పుడు టాప్ స్కోర్ 205 నాటౌట్ గా నిలిచింది.[3] 1982-83, 1983-84, 1988-89 నుండి 1990-91 వరకు వెల్లింగ్టన్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. హాక్ కప్‌లో హాక్స్ బే తరపున కూడా ఆడాడు.
తర్వాత క్రికెట్ వెల్లింగ్టన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయ్యాడు. 2007, ఆగస్టు 31న ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.