ఎల్. మురుగన్ | |||
![]()
| |||
కేంద్ర పశుసంవర్థక, మత్స్యశాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం జులై 2021 – ప్రస్తుతం | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | ప్రతాప్ చంద్ర సారంగీ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 | |||
ముందు | థావర్ చంద్ గెహ్లాట్ | ||
నియోజకవర్గం | మధ్యప్రదేశ్ | ||
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 11 మార్చి 2020 – 7 జులై 2021 | |||
ముందు | తమిళిసై సౌందరరాజన్ | ||
తరువాత | కే. అన్నామలై | ||
వైస్ - చైర్మన్ , భారత జాతీయ ఎస్సీ కమిషన్
| |||
పదవీ కాలం 2017 – 2020 | |||
ముందు | రాజ్ కుమార్ వేర్క | ||
తరువాత | అరుణ్ హాల్డేర్ | ||
2వ తమిళనాడు సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2021 – ప్రస్తుతం | |||
అధ్యక్షుడు | ఎం. కె. స్టాలిన్ | ||
ముందు | గాయత్రి రఘురాం | ||
తరువాత | ప్రస్తుతం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కోనూర్,నమ్మక్కల్ జిల్లా, తమిళనాడు | 29 మే 1977||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | వరుదమ్మాళ్, లోగనాథన్ | ||
జీవిత భాగస్వామి | సి. కళైయరసి | ||
సంతానం | 2 | ||
నివాసం | 353, గుజ్జి 1st క్రాస్ స్ట్రీట్, అన్న నగర్, చెన్నై, తమిళనాడు, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | * మద్రాస్ లా కాలేజీ (ఎల్‌ఎల్.ఎం. , పీహెచ్‌డీ)
|
లోగనాథన్ మురుగన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 నుండి కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ఎల్. మురుగన్ 1977 మే 29న తమిళనాడు, నమ్మక్కల్ జిల్లా, కోనూర్ లో లోగనాథన్, వరుదమ్మాళ్ దంపతులకు జన్మించాడు.[1][2] ఆయన చెన్నైలోని డాక్టర్ అంబేద్కర్ లా కాలేజీలో నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.[3]
ఎల్. మురుగన్ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తరువాత అఖిల్ భారతీయ విద్యా పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో సభ్యత్వం తీసుకున్నాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి వివిధ స్థాయిల్లో పనిచేసి 2017 నుండి 2020 వరకు భారత జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా విధులు నిర్వహించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మురుగన్ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బీజేపీ పార్టీ తరపున ఓ యాత్ర చేపట్టి 30 రోజుల పాటు తమిళనాడులో బీజేపీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి పార్టీకి మంచి పట్టు తీసుకువచ్చాడు.
మురుగన్ 2021లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. ఆయన తిరువూర్ జిల్లాలోని ధరపురం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన నాయకత్వంలో తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్, తిరునల్వేలి, నాగర్ కోవిల్, మోడక్కురిచి నియోజకవర్గాల్లో నలుగురు బీజేపీ అభ్యర్థులను గెలిపించి దాదాపుగా 20 ఏళ్ల తరువాత బీజేపీ ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఎల్. మురుగన్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన కేంద్రప్రభుత్వంలో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ, పశుసంవర్థక, మత్స్యశాఖ సహాయ మంత్రిగా 2021 జూలై 7న ప్రమాణస్వీకారం చేశాడు.[4] ఆయన 2021 సెప్టెంబరులో మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link)
{{cite web}}
: |first3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)