ఎల్లారెడ్డి | |
— జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ రాష్ట్రంలో ఎల్లారెడ్డి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°11′55″N 78°00′41″E / 18.198640°N 78.011390°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి జిల్లా |
మండలం | ఎల్లారెడ్డి |
జనాభా (2011) | |
- మొత్తం | 14,923 |
- పురుషుల సంఖ్య | 7,493 |
- స్త్రీల సంఖ్య | 7,430 |
- గృహాల సంఖ్య | 3,131 |
పిన్ కోడ్ | 503122 |
ఎస్.టి.డి కోడ్ |
ఎల్లారెడ్డి,తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలానికి చెందిన జనణగణన పట్టణం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] ఇది కామారెడ్డి జిల్లాకు 42 కి.మీ.దూరంలో ఉంది.[3] కామారెడ్డి జిల్లా ఏర్పడకముందు ఎల్లారెడ్డి పట్టణం/ గ్రామం, నల్గొండ జిల్లా, కామారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలో,ఇదే పేరుతో ఉన్న మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఎల్లారెడ్డి గ్రామాన్ని, కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా, కామారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోకి ఎల్లారెడ్డి ప్రధాన కేంద్రంగా ఉన్న ఎల్లారెడ్డి మండలంలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఎల్లారెడ్డి పట్టణ జనాభా మొత్తం 14,923. ఇందులో 7,493 మంది పురుషులు కాగా, 7,430 మంది మహిళలు ఉన్నారు.పట్టణంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1761. ఇది ఎల్లారెడ్డి (సిటి) మొత్తం జనాభాలో 11.80%గా ఉంది.పట్టణ పరిధిలో స్రీల సెక్స్ నిష్పత్తి 993 సగటుతో పోలిస్తే 992 గా ఉంది. పురుషుల అక్షరాస్యత 84.66% కాగా, మహిళా అక్షరాస్యత 65.49%గా ఉంది.[4] పట్టణ పరిధిలో మొత్తం 3,131 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది.దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను యల్లారెడ్డి పురపాలకసంఘం అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిధిలో రహదారులను నిర్మించడానికి, ఇతర వసతులు సమకూర్చటానికి పురపాలక సంఘం పరిధిలోని ఆస్తులపై పన్ను విధించడానికి అధికారం కలిగిఉంది.[4]