ఎస్.వై. పి .రెడ్డి | |||
| |||
పదవీ కాలం 2014-2019 | |||
నియోజకవర్గం | నంద్యాల | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అంకాలమ్మగూడూరు, ఆంధ్రప్రదేశ్ | 1950 జూన్ 4||
మరణం | 2019 ఏప్రిల్ 30 | (వయసు 68)||
జీవిత భాగస్వామి | ఎస్.పార్వతి | ||
సంతానం | సుజల, అరవింద రాణి | ||
నివాసం | నంద్యాల | ||
మతం | హిందూ |
ఎస్.పి.వై.రెడ్డి భారతదేశం యొక్క 16వ లోక్ సభ సభ్యుడు. అతను ఆంధ్రప్రదేశ్ నంద్యాల నియోజకవర్గమునకు ప్రాతినిధ్యం వహించాడు. అతను ఆంధ్రప్రదేశ్ ఆధారిత నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, అధినేత.[1][2]
అతను ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా అంకాలమ్మగూడూరు గ్రామంలో 1950 జూన్ 4 న జన్మించాడు. ఈయన NIT వరంగల్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ పట్టా పొందాడు. ముంబై ఆధారిత భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (భారతదేశం యొక్క ప్రీమియం న్యూక్లియర్ ఫెసిలిటి) లో చేరాడు.[3] 1977లో సైంటిఫిక్ ఆఫీసర్ యొక్క స్థానం నుండి నిష్క్రమించాడు. 1979లో ఒక ప్లాస్టిక్ కంటైనర్ల ఉత్పాదక ప్లాంట్‌ను నెలకొల్పాడు. తరువాత, అతను తన సంస్థ యొక్క కార్యకలాపాలను వైవిధ్యపరచాడు, 1984లో నంది పైపుల పేరుతో PVC పైపుల తయారీ రంగంలోకి దిగాడు. తరచుగా ఇతను నిర్వహించే ఉన్నత చర్యల ద్వారా నంద్యాల ప్రాంతంలో బాగా గుర్తింపు పొందాడు. అతని రాజకీయ జీవితం బిజెపితో ప్రారంభమయింది. ఇతను బిజెపి తరఫున 1991 ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి పోటీచేయగా భారీ తేడాతో ఓడిపోయాడు. 1999 అసెంబ్లీ ఎన్నికలలో ఇతను నంద్యాల, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల రెండింటికీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఈ సమయంలో అతను నంద్యాలలో స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[4] 2000లో కాంగ్రెస్ తరపున పురపాలక ఛైర్మన్ అభ్యర్థిత్వానికి టికెట్ పొంది రికార్డ్ మెజారిటీ సాధించాడు. 2004లో అతను నంద్యాల నుండి పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి లక్ష మెజారిటీ సాధించాడు. 2009లో మరోసారి ఇదే నియోజకవర్గం నుండి గెలిచాడు. ఇతను 2014 లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 1.08 లక్షల మెజారిటీతో నంద్యాల నుండి పార్లమెంటు సభ్యునిగా మూడోసారి గెలుపొందాడు.[5] గెలుపొందిన అనంతరం అతను టిడిపి లో చేరాడు. 2019 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ నుంచి నంద్యాల సీటు ఆశించి భంగపడ్డ అతను జనసేన పార్టీలోకి చేరాడు. జనసేన పార్టీ తరపున నంద్యాల నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[6]
కొంతకాలంగా మూత్రపిండాలు, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతను 2019 ఏప్రిల్ 30 న మరణించాడు.[7]