ఎస్.ఎ.చంద్రశేఖర్ | |
---|---|
![]() | |
జననం | ఎస్.ఎ.చంద్రశేఖర్[1] |
వృత్తి | నటుడు, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1981-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | శోభ చంద్రశేఖర్ |
పిల్లలు | ఇద్దరు, విజయ్ తో సహా |
బంధువులు | విక్రాంత్ (మేనల్లుడు) విరాజ్ (అల్లుడు) |
ఎస్.ఎ.చంద్రశేఖర్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు, రచయిత. ఇతడు ముఖ్యంగా తమిళ చిత్రాలకు పనిచేశాడు.[3] ఇతడు సట్టం ఒరు ఇరుత్తరై (1981) అనే తమిళ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[4] ఇతడు వేట్రి, నాన్ సిగప్పు మనిధన్, ముత్తం, సట్టం ఒరు ఇరుత్తరై వంటి అనేక విజయవంతమైన సినిమాలను తీశాడు.
ఎస్.ఎ.చంద్రశేఖర్ తమిళనాడు రాష్ట్రంలోని, రామేశ్వరం నగరంలోని "తంగచిమదం" అనే ప్రాంతానికి చెందినవాడు.[2] ఇతడు కర్ణాటక సంగీత కళాకారిణి శోభను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించింది. కొన్ని సినిమాలలో పాటలు పాడింది. కొన్ని సినిమాలకు కథను సమకూర్చింది. ఇతని కుమారుడు విజయ్ కూడా తమిళ సినిమా నటుడు, గాయకుడు.[5] ఇతని దర్శకత్వంలో వెలువడిన "నాలయ తీర్పు" అనే సినిమాతో విజయ్ వెండితెర జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని కుమార్తె విద్య రెండేళ్ల వయసులోనే మరణించింది.[6] ఇతని సమీప బంధువులు ఎస్.ఎన్.సురేందర్ నేపథ్య గాయకుడిగా, విక్రాంత్ నటుడిగా సినిమాలలో పనిచేస్తున్నారు.
ఇతడు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా ఏడు చలన చిత్రాలను నిర్మించాడు. 17 తమిళ సినిమాలకు కథను అందించాడు. 44 సినిమాలకు స్క్రీన్‌ప్లే వ్రాశాడు. అంతే కాక 15 సినిమాలలో నటించాడు కూడా. ఇతడు తెలుగులో "చట్టానికి కళ్లులేవు", "బలిదానం", "పల్లెటూరి మొనగాడు", "దేవాంతకుడు", "దోపిడి దొంగలు", "ఇంటికో రుద్రమ్మ" సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతని సినిమాలలో విజయ కాంత్, విజయ్, రజనీకాంత్, చిరంజీవి, శోభన్ బాబు, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్ నాగ్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, ధనుష్ మొదలైన హీరోలు నటించారు. విజయశాంతి, రోహిణి, త్రిష, ముచ్చర్ల అరుణ, ఆరతి, మేఘనా నాయుడు, రాధిక, పూనమ్ కౌర్, రంభ, ప్రియాంక చోప్రా, అభిరామి, మీనా, సిమ్రాన్ మొదలైన నటీమణులు ఇతని సినిమాల్లో నటించారు. ఇతడు ఎక్కువగా విజయకాంత్, విజయ్‌లతో సినిమాలు తీశాడు. ఇతని కుమారుడు విజయ్ ఇతని దర్శకత్వంలో 16 పైచిలుకు సినిమాలలో నటించాడు. ఎస్. శంకర్, ఎం.రాజేష్, పొన్‌రామ్, రజినీ మురుగన్ తదితరులు ఇతని వద్ద సహాయకులుగా పనిచేసి ఆ తరువాత దర్శకులుగా రాణించారు.[7][8]
ఇతడు ఒక ఆడియో రిలీజింగ్ ఫంక్షన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కాడు. తిరుపతి దేవస్థానంలో ప్రజలు దేవునికి ముడుపుల పేరుతో లంచం ఇస్తున్నారని, భగవంతుడు భక్తుల కోరికలన్నీ తీర్చేటట్టయితే ఇక ఎవరూ చదువుకోవలసిన అవసరం లేదని ఇతడు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. హిందు మున్నాని అనే సంస్థ ఇతని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఇతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందూ మున్నాని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్ట్ న్యాయాధికారి ఇతనిపై కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాడు.[9]
సంవత్సరం | సినిమా | పనిచేసిన శాఖ | భాష | వివరణ | ||||
---|---|---|---|---|---|---|---|---|
దర్శకత్వం | నిర్మాణం | స్క్రీన్‌ప్లే | కథ | నటన | ||||
2018 | ట్రాఫిక్ రామసామి | ![]() |
తమిళం | |||||
2016 | కోడి | ![]() |
తమిళం | తెలుగులో ధర్మయోగి పేరుతో డబ్ అయ్యింది. | ||||
2016 | నయ్యపుదై | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
2015 | టూరింగ్ టాకీస్ | ![]() |
![]() |
![]() |
![]() |
![]() |
తమిళం | |
2011 | సత్తపది కుట్రమ్ | ![]() |
![]() |
![]() |
![]() |
తమిళం | ||
2010 | వెలుతు కట్టు | ![]() |
తమిళం | |||||
2008 | పంద్యం | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
2007 | నెంజిరుక్కుమ్ వరై | ![]() |
![]() |
తమిళం | ||||
2006 | ఆది | ![]() |
తమిళం | తెలుగులో "నేనేరా ఆది" పేరుతో డబ్ అయ్యింది. | ||||
2005 | సుక్రన్ | ![]() |
![]() |
![]() |
![]() |
![]() |
తమిళం | |
2003 | ముత్తం | ![]() |
![]() |
తమిళం | ||||
2002 | తమిళన్ | ![]() |
తమిళం | దమ్ముంటే కాస్కో పేరుతో తెలుగులో డబ్బింగ్ చేయబడింది. | ||||
2001 | దోస్త్ | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
1999 | పెరియన్న | ![]() |
![]() |
తమిళం | ||||
1999 | నెంజినిలె | ![]() |
![]() |
![]() |
తమిళం | సారథి పేరుతో తెలుగులో డబ్ అయ్యింది. | ||
1998 | ప్రియముదన్ | ![]() |
తమిళం | ప్రేమించేమనసు పేరుతో తెలుగులో పునర్మించబడింది. | ||||
1997 | వన్స్‌మోర్ | ![]() |
![]() |
తమిళం | ||||
1996 | మాంబుమిగు మానవన్ | ![]() |
![]() |
తమిళం | ||||
1995 | విష్ణు | ![]() |
![]() |
తమిళం | మిస్టర్ హరికృష్ణ పేరుతో తెలుగులో డబ్ అయ్యింది. | |||
1995 | దేవా | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
1994 | రసిగన్ | ![]() |
![]() |
తమిళం | ||||
1993 | సెంధూరపండి | ![]() |
![]() |
తమిళం | బొబ్బిలి రాయుడు పేరుతో తెలుగులో డబ్ అయ్యింది. | |||
1993 | జీవన్ కి షత్రంజ్ | ![]() |
![]() |
హిందీ | ఇది "రాజనాదై" అనే తమిళ సినిమాకు రీమేక్ | |||
1993 | రాజదురై | ![]() |
![]() |
తమిళం | రాజసింహ పేరుతో తెలుగులో డబ్ చేయబడింది. | |||
1992 | ఇన్నిసై మళై | ![]() |
![]() |
తమిళం | ||||
1992 | నాలయ తీర్పు | ![]() |
![]() |
తమిళం | ||||
1992 | మేరా దిల్ తేరే లియే | ![]() |
హిందీ | నంబరగళ్ అనే తమిళ సినిమా రీమేక్ | ||||
1992 | ఇన్సాఫ్ కి దేవి | ![]() |
హిందీ | |||||
1990 | ఆజాద్ దేశ్ కె గులామ్ | ![]() |
![]() |
తమిళం | ||||
1990 | జై శివ్ శంకర్ | ![]() |
హిందీ | |||||
1990 | సీత | ![]() |
తమిళం | |||||
1989 | రాజనాదై | ![]() |
![]() |
తమిళం | ||||
1988 | ఇదు ఎంగళ్ నీతి | ![]() |
![]() |
తమిళం | ||||
1988 | సుధాంతిర నాత్తిన్ ఆడిమైగళ్ | ![]() |
తమిళం | |||||
1988 | పూవుం పూయలం | ![]() |
తమిళం | |||||
1987 | ఖుద్రత్ కా కానూన్ | ![]() |
హిందీ | |||||
1987 | సట్టం ఒరు విలయాత్తు | ![]() |
![]() |
![]() |
![]() |
తమిళం | ||
1987 | నీతిక్కు దండనై | ![]() |
![]() |
![]() |
తమిళం | తెలుగులో న్యాయానికి శిక్ష పేరుతో పునర్మించబడింది. | ||
1986 | నీలవె మాలరె | ![]() |
![]() |
తమిళం | ||||
1986 | వసంత రాగం | ![]() |
![]() |
తమిళం | ||||
1986 | ఏనక్కు నానె నీదిపతి | ![]() |
![]() |
![]() |
![]() |
తమిళం | ||
1986 | ఏన్ శబదం | ![]() |
తమిళం | |||||
1986 | సిగప్పు మాలర్గల్ | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
1985 | ఇంటికో రుద్రమ్మ | ![]() |
తెలుగు | |||||
1985 | నీదియిన్ మరుపక్కమ్ | ![]() |
![]() |
తమిళం | ||||
1985 | నాన్ సిగప్పు మనిధన్ | ![]() |
![]() |
![]() |
తమిళం | తెలుగులో మిస్టర్ విజయ్ పేరుతో డబ్బింగ్ అయ్యింది. | ||
1985 | బలిదాన్ | ![]() |
హిందీ | |||||
1985 | పుదు యుగం | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
1984 | కుదుంబం | ![]() |
![]() |
![]() |
![]() |
తమిళం | ||
1984 | దోపిడి దొంగలు | ![]() |
తెలుగు | |||||
1984 | వీటుకు ఒరు కన్నగి | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
1984 | దేవాంతకుడు | ![]() |
తెలుగు | |||||
1984 | వేట్రి | ![]() |
తమిళం | |||||
1983 | సింహ గర్జనె | ![]() |
![]() |
కన్నడ | ||||
1983 | హసిద హెబ్బులి | ![]() |
![]() |
కన్నడ | ||||
1983 | సాచ్చి | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
1983 | సంసారం ఎంబత్తు వీణై | ![]() |
తమిళం | |||||
1983 | గెద్ద మగ | ![]() |
కన్నడ | "మూండ్రు మగం" తమిళ సినిమా రీమేక్ | ||||
1983 | పల్లెటూరి మొనగాడు | ![]() |
తెలుగు | |||||
1983 | బలిదానం | ![]() |
తెలుగు | పట్టణదు రాజక్కల్ సినిమా రీమేక్ | ||||
1982 | ఇదయం పెసుగిరాదు | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
1982 | న్యాయ ఎల్లిదె | ![]() |
![]() |
కన్నడ | ఇది సట్టం ఒరు ఇరుత్తరై అనే తమిళ సినిమా రీమేక్ | |||
1982 | ఓమ్ శక్తి | ![]() |
తమిళం | |||||
1982 | పట్టణదు రాజక్కల్ | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
1981 | నీది పిళైతదు | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
1981 | చట్టానికి కళ్లులేవు | ![]() |
![]() |
తెలుగు | ఇది సట్టం ఒరు ఇరుత్తరై అనే తమిళ సినిమా రీమేక్ | |||
1981 | జాదిక్కొరు నీది | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
1981 | నెంజిలె తునివిరుంతల్ | ![]() |
![]() |
![]() |
తమిళం | |||
1981 | సట్టం ఒరు ఇరుత్తరై | ![]() |
![]() |
తమిళం |
ఇతడు సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా అమెరికాలోని ఇంటర్నేషనల్ తమిళ్ యూనివర్సిటీ ఇతనికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి గౌరవించింది.[10]
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)