శేషారెడ్డి ఓబుల్‌రెడ్డి | |||
![]() ఎస్.ఓబుల్ రెడ్డి | |||
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి
| |||
పదవీ కాలం జూన్ 1, 1974 – ఏప్రిల్ 9, 1978 | |||
ముందు | గోపాలరావు ఎక్బోటే | ||
---|---|---|---|
తరువాత | ఆవుల సాంబశివరావు | ||
ఆంధ్రప్రదేశ్ గవర్నరు
| |||
పదవీ కాలం 1975 – 1976 | |||
ముందు | ఖండూభాయి దేశాయి | ||
తరువాత | మోహన్‌లాల్ సుఖాడియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆంధ్రప్రదేశ్ | 9 ఏప్రిల్ 1916||
జీవిత భాగస్వామి | డా. శకుంతలా ఓబుల్‌రెడ్డి |
జస్టిస్ ఎస్.ఓబుల్‌రెడ్డి (జ. 1916, ఏప్రిల్ 9) ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర హైకోర్టులకు ప్రధానన్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ గవర్నరు.[1]
ఓబుల్‌రెడ్డి విద్యాభ్యాసం నందలూరు బోర్డు ఉన్నత పాఠశాల, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో, మద్రాసు లా కాలేజీలో సాగింది. 1947లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి, గ్రేడ్ 2, గ్రేడ్ 1, జిల్లా, సెషన్ స్ న్యాయమూర్తిగా పదవోన్నతి పొందుతూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, ఆపై శాశ్వత న్యాయమూర్తిగా 1974 వరకు పనిచేశాడు.1974, జూన్ 1 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఆపదవిలో కొనసాగుతున్న కాలంలో 1975 జనవరి 26 నుండి 1976 జూలై 10 వరకు, దాదాపు ఒక సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక గవర్నరుగా బాధ్యతలు చేపట్టాడు. ఎమర్జెన్సీ కాలంలో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి నచ్చని విధంగా తీర్పుచెప్పినందుకు 1976, జూలై 7న గుజరాత్ హైకోర్టుకు ప్రధానన్యాయమూర్తిగా బదిలీ అయ్యాడు.[2] తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా 1977 ఆగస్టు 19న బదిలీ అయ్యాడు. ఆ పదవిలో 1978, ఏప్రిల్ 8 దాకా పనిచేసి పదవీవిరమణ పొందాడు.
నేషనల్ లా కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎం.జగన్నాథరావు, ఓబుల్‌రెడ్డి గురించి ప్రసంగిస్తూ, [3] "జస్టిస్ ఓబుల్‌రెడ్డి చాలా తెలివైనవాడు, చురుకు, చలాకీ, సాంప్రదాయక న్యాయమూర్తి. ప్రగతిశీలక న్యాయమూర్తి కాదు. కఠినమైన క్రమశిక్షణాపరుడు. న్యాయవాదులతోనూ, న్యాయసంఘంతోనూ అదే క్రమశిక్షణతో వ్యవహరించేవాడు. తనక్రింది న్యాయవాదులు కానీ, న్యాయవాదసంఘంగానీ, తన నియమనిబంధనలు ఏమనుకుంటుందో అని పెద్దగా పట్టించుకొనేవాడు కాదు. జూనియర్ న్యాయవాదులతోనూ, సీనియర్ న్యాయవాదులతోనూ ఒకేలా ప్రవర్తించేవాడు. తీర్పులివ్వటంలో ఎప్పుడూ జాప్యం చేయలేదు. దైవభీతి కలవాడు, దైవసంకల్పాన్ని పై నమ్మకం కలవాడు." అని వర్ణించాడు.