ఎస్.రాజం | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1919 ఫిబ్రవరి 10 |
మూలం | భారతదేశం |
మరణం | 2010 జనవరి 29 | (వయసు 90)
వృత్తి | నటుడు, చిత్రకళాకారుడు, సంగీత విద్వాంసుడు |
సుందరం రాజం ( 1919 ఫిబ్రవరి 10 – 2010 జనవరి 29) తమిళనాడుకు చెందిన కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, చలనచిత్ర నటుడు, చిత్రకళాకారుడు. ఇతడు పాపనాశం శివన్ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ఇతని సోదరుడు తమిళ సినిమా దర్శకుడు, వైణికుడు ఎస్.బాలచందర్. ఇతని సోదరి ఎస్.జయలక్ష్మి తమిళ సినిమా నటి. ఇతడు 1934లోసీతా కళ్యాణం సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఇతడు పూర్తి స్థాయి సంగీత విద్వాంసుడిగా మారక మునుపు కొన్ని సినిమాలలో ముఖ్యపాత్రలను ధరించాడు. ఇతడు ఆకాశవాణిలో నిలయ విద్వాంసునిగా, మ్యూజిక్ సూపర్‌వైజర్‌గా బాధ్యతలను నిర్వహించాడు. ఇతడు గీసిన సంగీత త్రిమూర్తుల తైలవర్ణ చిత్రాలు ప్రపంచఖ్యాతిని ఆర్జించాయి. కోటీశ్వర అయ్యర్ రచనలకు ప్రాచుర్యం కల్పించడంతో ఇతడు ప్రధాన భూమిక వహించాడు. ఇతడు మద్రాసు సంగీత అకాడమీ సభ్యునిగా ఉన్నాడు.[1] [2][3][4][5][6][7][8]
ఇతడు నటించిన సినిమాలు: