చుడుతో జమీర్ తకతులకు దంపతులకు 1931 అక్టోబర్ 17న ఎస్సీ జమీర్ జన్మించాడు. [3] ఎస్సీ జమీర్ తన ప్రారంభ విద్యను మోకోక్‌చుంగ్‌లో, కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీలో ఆర్ట్స్‌లో ఇంటర్మీడియట్, [4] అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించాడు .
ఎస్సీజమీర్ 1961లో నాగాలాండ్ రాష్ట్రం నుండి మొదటి లోక్ సభ సభ్యునిగా పార్లమెంటు ఎన్నికయ్యారు. [5] 1961 నుండి 1970 వరకు, అతను పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు ఈ కాలంలో అతను రైల్వేలు, లేబర్ & పునరావాసం కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశాడు, 1968 నుండి 1970 వరకు, కేంద్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ & కోఆపరేషన్, ఫుడ్ సహాయ మంత్రిగా పనిచేశాడు. ఎస్సీ జమీర్ జవహర్లాల్ నెహ్రూ హయాంలో పార్లమెంట్ కార్యదర్శి గా పనిచేశాడు.
ఎస్సీజమీర్ జూలై 2004 నుండి జూలై 2008 వరకు గోవా గవర్నర్‌గా పనిచేశాడు [6]మహారాష్ట్ర గవర్నర్ SM కృష్ణ రాజీనామా తర్వాత, 6 మార్చి 2008న, మహారాష్ట్ర తాత్కాలిక గవర్నర్‌గా పనిచేశాడు. [6][7] 9 మార్చి 2013న ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు. [6][8]