వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | గోజ్రా, పంజాబ్, పాకిస్తాన్ | 1993 మార్చి 15|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 4 అం. (193 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 213) | 2013 ఫిబ్రవరి 22 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2015 జూలై 7 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 190) | 2013 మే 17 - స్కాంట్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2015 మార్చి 20 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012– | HBL క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012– | ఫైసలాబాద్ వుల్వ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | లాహోర్ కలందర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023-present | MI New York | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2013 డిసెంబరు 10 |
ఎహ్సాన్ ఆదిల్ (జననం 1993, మార్చి 15) పాకిస్తాన్ క్రికెటర్. మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడాడు. 2023 జూలైలో రిటైర్మెంట్‌కు ముందు 2013 - 2015 మధ్యకాలంలో పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ఆడాడు.[2]
ఎహ్సాన్ కుడిచేతి బ్యాట్, కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్ లో రాణించాడు. ఫైసలాబాద్ వోల్వ్స్, హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ క్రికెట్ జట్టు, పాకిస్తాన్ అండర్-19 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[3]
ఆస్ట్రేలియాలో జరిగిన 2012 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ అండర్-19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సంవత్సరం తరువాత హబీబ్ బ్యాంక్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు, అందులో ఆరు వికెట్లు పడగొట్టాడు. నాలుగు రోజుల దేశీయ పోటీ ప్రెసిడెంట్స్ ట్రోఫీలో 17.88 సగటుతో 54 వికెట్లు తీసి రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దాంతో దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన మూడో బంతికే గ్రేమ్ స్మిత్‌ను అవుట్ చేశాడు.[4]
2019 మార్చిలో, 2019 పాకిస్థాన్ కప్ కోసం పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[5][6] 2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ టోర్నమెంట్ కోసం సెంట్రల్ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[7][8]