వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఏంజెలో డేవిస్ మాథ్యూస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొలంబో, శ్రీలంక | 1987 జూన్ 2|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 0 అం. (1.83 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 112) | 2009 జూలై 4 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూలై 24 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 137) | 2008 డిసెంబరు 31 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 మార్చి 31 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 69 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 28) | 2009 జూన్ 8 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2021 మార్చి 7 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 69 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2010 | కోల్‌కతా నైట్‌రైడర్స్ (స్క్వాడ్ నం. 69) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2013 | పూణే వారియర్స్ (స్క్వాడ్ నం. 69) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | Nagenahira Nagas (స్క్వాడ్ నం. 69) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015; 2017 | ఢిల్లీ డేర్ డెవిల్స్ (స్క్వాడ్ నం. 69) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | Lahore Qalandars (స్క్వాడ్ నం. 69) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–2022 | Colombo Stars (స్క్వాడ్ నం. 69) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 మార్చి 20 |
ఏంజెలో డేవిస్ మాథ్యూస్, (జననం 1987, జూన్ 2) శ్రీలంక క్రికెటర్, మాజీ కెప్టెన్. క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. మాథ్యూస్ ప్రస్తుతం శ్రీలంక తరపున టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్ ఆడుతున్నాడు.[1][2] 2014 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా, 2011 క్రికెట్ ప్రపంచ కప్, 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20, 2012 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 ఫైనల్స్‌కు చేరిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మాథ్యూస్, లసిత్ మలింగ వన్డే క్రికెట్‌లో అత్యధిక తొమ్మిదో వికెట్ భాగస్వామ్యానికి సంబంధించిన రికార్డును కలిగి ఉన్నారు.[3] 2022 జూలైలో మాథ్యూస్ శ్రీలంక తరపున తన 100వ టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. కెప్టెన్‌గా, మాథ్యూస్ తన జాతీయ జట్టును 2014 ఆసియా కప్ విజేతగా నిలబెట్టాడు.
ప్రపంచ కప్ 2023 భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 2023 నవంబరు 6న శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచులో ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించడంతో ఆయన ఒక్క బంతి ఆడకుండానే పెవిలియన్ చేరి అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి టైమ్‌డ్ ఔట్ అయిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.[4]
2005 సెప్టెంబరులో కొలంబోలోని పోలీస్ పార్క్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్ ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక అండర్-23ల కోసం మాథ్యూస్ తన లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు. శ్రీలంకలో జరిగిన 2006 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు.[5] తర్వాత 2006 నవంబరులో కొలంబో క్రికెట్ క్లబ్‌కు ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.
హెషానీ సిల్వాతో మాథ్యూస్ వివాహం జరిగింది. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే సమక్షంలో 2013 జూలై 18న సిన్నమన్ గ్రాండ్ హోటల్‌లో వివాహ రిసెప్షన్ జరిగింది.[6][7] వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.[8]
2008 నవంబరులో జింబాబ్వేతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేసాడు. 2009 జూలైలో గాలేలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు.
2014 నవంబరు 16న రాంచీలో భారత్‌పై మాథ్యూస్ తన మొదటి వన్డే సెంచరీని సాధించాడు. నాలుగు బౌండరీలు, పది భారీ సిక్సర్లు కొట్టాడు, కానీ చివరకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన సెంచరీతో శ్రీలంక ఓడిపోయింది. అయితే మాథ్యూస్ కెప్టెన్సీలో 2014లో భారత్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఓడిపోయింది. ద్వైపాక్షిక సిరీస్‌లో శ్రీలంకకు ఇదే అతిపెద్ద ఓటమి.[9]
సనత్ జయసూర్య, అరవింద డి సిల్వా, తిలకరత్నే దిల్షాన్ తర్వాత 3000 వన్డే పరుగులతో 100 వన్డే వికెట్లు తీసిన నాల్గవ శ్రీలంక ఆల్ రౌండర్‌గా మాథ్యూస్ నిలిచాడు. 2015 జూలై 26న మహ్మద్ హఫీజ్‌ను ఎల్‌బీడబ్ల్యూ ద్వారా తన 100వ వన్డే వికెట్‌ను తీసుకున్నాడు.[10]
2021 జూలై 7న మాథ్యూస్ భారతదేశంతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఎస్ఎల్సీతో టూర్ కాంట్రాక్ట్‌పై సంతకం చేయనందున అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లు ప్రకటించాడు.