ఏక్‌నాథ్ షిండే

ఏక్‌నాథ్ శంభాజీ షిండే
ఏక్‌నాథ్ షిండే


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
5 డిసెంబరు 2024 (2024-12-05)
Serving with అజిత్ పవార్
గవర్నరు సీ.పీ. రాధాకృష్ణన్
ముందు దేవేంద్ర ఫడ్నవిస్

పదవీ కాలం
30 జూన్ 2022 (2022-06-30) – 5 డిసెంబరు 2024 (2024-12-05)
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
రమేష్ బైస్
ముందు ఉద్ధవ్ ఠాక్రే
తరువాత దేవేంద్ర ఫడ్నవిస్

మహారాష్ట్ర పట్టణాభివృద్ధి , పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌తో సహా) & రాష్ట్ర సరిహద్దు రక్షణ శాఖ మంత్రి
పదవీ కాలం
2019 డిసెంబరు 30 – 2022 జూన్ 27
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు
  • ఏక్‌నాథ్ షిండే (తాత్కాలిక)
    (పట్టణ అభివృద్ధి ప్రజా పనులు)
  • ఉద్ధవ్ థాకరే (అదనపు బాధ్యత)
    (సరిహద్దు రక్షణ)
తరువాత సుభాష్ దేశాయ్ (అదనపు బాధ్యత)

మహారాష్ట్ర ప్రజారోగ్య మంత్రి
పదవీ కాలం
2019 జనవరి 7 – 2019 నవంబరు 12
ముందు దీపక్ సావంత్
తరువాత జయంత్ పాటిల్ (నటన)

మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి (పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌తో సహా)
పదవీ కాలం
2014 డిసెంబరు 5 – 2019 నవంబరు 12
గవర్నరు
ముందు ఏక్నాథ్ ఖడ్సే (నటన)
తరువాత ఏక్‌నాథ్ షిండే

పదవీ కాలం
2022 జులై 3 – 2024 డిసెంబరు 5
ముందు ఉద్ధవ్ ఠాక్రే
తరువాత దేవేంద్ర ఫడ్నవిస్

పదవీ కాలం
2014 నవంబరు 12 – 2014 డిసెంబరు 5
ముందు ఏక్‌నాథ్ ఖడ్సే
తరువాత రాధాకృష్ణ విఖే పాటిల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
ముందు నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది
నియోజకవర్గం కోప్రి-పచ్పఖాడి
పదవీ కాలం
2004 – 2009
ముందు మోరేశ్వర్ జోషి
తరువాత రాజన్ విచారే
నియోజకవర్గం థానే

శివసేన చైర్మన్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023 ఫిబ్రవరి 17
ముందు ఉద్ధవ్ ఠాక్రే

వ్యక్తిగత వివరాలు

జననం (1964-02-09)1964 ఫిబ్రవరి 9
దారే, సతారా, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన (1999– )
ఇతర రాజకీయ పార్టీలు మహా యుతి (2022–ప్రస్తుతం; 2014–2019)
ఎన్‌డీఏ (2022–ప్రస్తుతం; 1999–2019)
బాలాసాహెబంచి శివసేన (2022–2023)
తల్లిదండ్రులు శంభాజీ షిండే, గంగూబాయి
జీవిత భాగస్వామి లతా షిండే
సంతానం 3, శ్రీకాంత్ షిండేతో సహా[1]
నివాసం 5, ల్యాండ్ మార్క్ కో, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్, థానే వెస్ట్
పూర్వ విద్యార్థి యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ (బిఎ)
వృత్తి రాజకీయ నాయకుడు

ఏకనాథ్ శంభాజీ షిండే (జననం: 1964 ఫిబ్రవరి 9)[2][3] అజిత్ పవార్‌తో పాటు 2024 డిసెంబరు నుండి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2023 ఫిబ్రవరి నుండి శివసేన అధ్యక్షుడిగా ఉన్నాడు.[4]అతను 2022 జూన్ నుండి 2024 డిసెంబరు వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. గతంలో 2004 నుండి 2009 వరకు థానే శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడుగా ఉన్నారు. ఆ తరువాత మహారాష్ట్రలోని థానేలోని కోప్రి-పచ్‌పఖాడి నియోజకవర్గం నుండి అతను 2009 నుండి 2024 ఎన్నికలవరకు వరుసగా మహారాష్ట్ర శాసనసభకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా, మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.[5][6]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఏక్‌నాథ్‌ షిండే 1964 ఫిబ్రవరి 9న జన్మించాడు. అతను యశ్వంతరావు చవాన్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేశాడు.[7]

వివాహం

[మార్చు]

ఏక్‌నాథ్ షిండే లతా షిండేతో వివాహం జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోవడంతో చనిపోయారు. ఏక్‌ నాథ్ షిండే మరో కొడుకు శ్రీకాంత్ షిండే ఆర్థోపెడిక్ సర్జన్. అతను కళ్యాణ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[8]

రాజకీయ జీవితం

[మార్చు]

ఏక్‌నాథ్‌ షిండే 1980లో శివసేన పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1997లో జరిగిన థానే మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. అతను 2004లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి - పచ్చపాఖాది నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఏక్‌నాథ్‌ షిండే ఆ తరువాత 2009, 2014, 2019లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అతను 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పని చేసి 28 నవంబర్ 2019 నుండి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా-వికాస్- అఘాడి ఆధ్వర్యంలో ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా పని చేసి[9] శివ‌సేన పార్టీపై అసంతృప్తితో తిరుగుబాటు చేయడంతో 2022 జూన్ 21న శివసేన పార్టీ నుండి సస్పెండ్‌ అయ్యాడు.[10][11]

ఏక్‌నాథ్ షిండే 2022 జూన్ 30న మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, 2024 డిసెంబరు 4 వరకు విధులు నిర్వహించాడు.[12] అతను 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల అనంతరం 2024 డిసెంబరు 4న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[13]

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2019). "Shrikant Eknath Shinde". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  2. "How Fadnavis Got Eknath Shinde To Accept Deputy CM Role In Just 20 Minutes | Inside Story". News18 (in ఇంగ్లీష్). Retrieved 2024-12-05.
  3. "'Eknath Shinde era over, he has been tossed aside': Sanjay Raut ahead of Devendra Fadnavis swearing-in as Maharashtra CM". The Times of India. 2024-12-05. ISSN 0971-8257. Retrieved 2024-12-05.
  4. "एकनाथ शिंदे को शिवसेना मुख्य नेता, राष्ट्रीय कार्यकारिणी की बैठक में हुआ फैसला". News18 हिंदी (in హిందీ). 2023-02-21. Retrieved 2023-02-21.
  5. Sakshi (21 June 2022). "మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం.. ఎవ‌రీ ఏక్‌నాథ్ షిండే?". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  6. Eenadu (21 June 2022). "'మహా' రాజకీయ సంక్షోభం.. ఎవరీ ఏక్‌నాథ్‌ షిండే..?". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  7. V6 Velugu (21 June 2022). "ఎవరీ ఏక్‌నాథ్‌ షిండే ?". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Andhra Jyothy (30 June 2022). "ఆటో డ్రైవర్ సీట్ టూ సీఎం సీట్.. షిండే జీవితంలో విషాదకరమైన రోజు అదే." Archived from the original on 30 June 2022. Retrieved 30 June 2022.
  9. telugu (21 June 2022). "ఎవ‌రీ ఏక్‌నాథ్ షిండే.. మ‌హారాష్ట్ర‌లో ఎవ‌రి బ‌ల‌మెంత?". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  10. "శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే సస్పెన్షన్‌". 21 June 2022. Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  11. Andhra Jyothy (21 June 2022). "ఏక్‌నాథ్ షిండే పై శివసేన వేటు, శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగింపు". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  12. 10TV (30 June 2022). "మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణం.. డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్" (in telugu). Archived from the original on 30 June 2022. Retrieved 30 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  13. Sakshi (5 December 2024). "డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.