ఏనుగ శ్రీనివాసులురెడ్డి (1924 జూలై 1, పల్లప్రోలు, ఆంధ్రప్రదేశ్) అంతర్జాతీయంగా పేరొందిన ఆచార్యుడు, మేధావి, వర్ణవివక్షపై పోరాటకారుడు. ఐక్యరాజ్య సమితిలో పలు హోదాల్లో పనిచేశాడు. ఐరాస వర్ణవివక్షకు వ్యతిరేకంగా పనిచేయడంలో శ్రీనివాసులురెడ్డి కృషి ఉంది.[1]
వర్ణవివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని మలిచి, ఆ ఉద్యమం కోసం అంతర్జాతీయ సమాజాన్ని సమీకరించడంలో శ్రీనివాసులురెడ్డి కృషి ఎంతో ఉంది. ఐరాసలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక కమిటీ, సెంటర్ అగైన్స్ట్ అపార్తీడ్‌ల ఏర్పాటు కోసం పనిచేసి సాధించాడు. వర్ణవివక్షకు వ్యతిరేక ప్రత్యేక కమిటీలో 1963 నుంచి 1965 వరకూ కార్యదర్శిగా పనిచేశాడు. సెంటర్ అగైన్స్ట్ అపార్తీడ్‌కు 1976 నుంచి 1983 వరకూ డైరెక్టర్‌గా సేవలందించాడు. దక్షిణాఫ్రికాలో ఐరాస ట్రస్ట్ ఫండ్ నిర్వహణకు, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇన్ సదరన్ ఆఫ్రికా నిర్వహణకు డైరెక్టరు హోదాలో పనిచేశాడు.[1]
2013 ఏప్రిల్ 27న దక్షిణాఫ్రికా రిపబ్లిక్ ఆర్డర్ ఆఫ్ కంపానియన్స్ ఆఫ్ ఓ ఆర్ టాంబో: సిల్వర్‌ను అధ్యక్షుడు జె.జి.జుమా నుంచి అందుకున్నాడు.
2000లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.[2]