మిషన్ రకం | Navigation |
---|---|
ఆపరేటర్ | ఇస్రో |
COSPAR ID | 2016-015A |
SATCAT no. | 41384 |
మిషన్ వ్యవధి | 10 సంవత్సరాలు |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | I-1K |
తయారీదారుడు | ISRO Satellite Centre Space Applications Centre |
లాంచ్ ద్రవ్యరాశి | 1,425 కిలోగ్రాములు (3,142 పౌ.) |
శక్తి | 1,300 watts |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | March 2016 (Planned) |
రాకెట్ | PSLV |
లాంచ్ సైట్ | సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంSecond |
కాంట్రాక్టర్ | ISRO |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | Geosynchronous |
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ (IRNSS-1F) ఉపగ్రహాన్నిభారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారు చేసింది. ఈ ఉపగ్రహన్ని భారతీయ క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహవ్యవస్థ (Indian regional navigation satellite system), నౌకయాన, విమానయాన నిర్వహణ, నౌకల యొక్క గమనాగమనమును పర్యవెక్షణ నిమిత్తం నిర్మించారు.అంతకు ముందుకూడా భారతీయ క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహవ్యవస్థ. నౌకయాన నిర్వహణ, నౌకల యొక్క గమనాగమనమును పర్యవేక్షణ నిమిత్తం ఇండియన్ రీజినల్ నావిగేసన్ శాటిలైట్ సిస్టం (IRNSS) శ్రేణికి సంబంధించి ఐదు ఉపగ్రహాలను ప్రయోగించారు.ఆ వరుసలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఆరవఉపగ్రహం.
ఇండియన్ రీజినల్ నావిగేసన్ శాటిలైట్ సిస్టం (IRNSS) శ్రేణికి సంబంధించి IRNSS-1A, 1B, 1C,1D, 1E ఉపగ్రహాలను విజయవంతంగా, ఇస్రో వారి పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన ఉపగ్రహవాహక నౌకలద్వారా అంతరిక్షంలో నిర్దేశిత పరిబ్రమణ కక్ష్యలో ప్రవేశపెట్టారు.
IRNSS-1A ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి-సీ22 ఉపగ్రహవాహక నౌకద్వారా 2013 జూలైలో, IRNSS-1B ఉపగ్రహన్ని పిఎస్‌ఎల్‌వి-సీ24 ఉపగ్రహవాహక నౌకద్వారా ఏప్రిల్2014లో, IRNSS-1C ని పిఎస్‌ఎల్‌వి-సీ26 ఉపగ్రహవాహక నౌక ద్వారా 2014 అక్టోబరులో,, IRNSS-1D ఉపగ్రహన్ని పిఎస్‌ఎల్‌వి-సీ27 ఉపగ్రహవాహక నౌకద్వారా 2015 మార్చిలో, పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహవాహకనౌక ద్వారా. 2016 జనవరి 20న IRNSS-1E ఉపగ్రహాన్ని శ్రీహరికోట లోని ధావన్ అంతరిక్షప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించారు
తాజాగా అంతరిక్షములోకి పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహం బరువు 1425కిలోలు.ఇందులో ఇంధనం బరువు 827 కిలోలు.ఇది 12 ఏళ్లపాటు సేవలు అందిస్తుంది.ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థలో ఇది ఆరో ఉపగ్రహం.ఇందులో దిక్సూచి, రేజి౦గ్ కు సంబంధించినపెలోడ్లతో (ఉపకరణాలు) పాటుఅత్యంత కచ్చితమైన రుబీడియం పరమాణు గడియారం ఉంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహం వ్యయం 120 కోట్లు[1]
ఉపగ్రహం రెండురకాల ఉపకరణాల సమూదాయాన్నికలిగిఉన్నది. అందులో ఒకటి దిక్సూచి (navigation payload) సంబంధించింది. రెండవది రెంజింగ్ (ranging) ఉపకరణాలు కలిగి ఉన్నాయి.నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలు కలిగిన విభాగం ఓడల/నౌకల, విమాన తదితర యానాలకు సంబంధించిన దిక్సూచి సమాచారాన్ని వినియోగదారులకు పంపిణి చేస్తుంది.నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలు L5- బ్యాండ్ (1176.45MHZ), S-బ్యాండ్ (2492.028 MHZ ) లో పనిచేయును. నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలలో అత్యంత కచ్చితమైన సమయాన్ని చూపించు రుబీడియం పరమాణు గడియారం అమర్చబడినది.[2]
రెంజింగ్ (ranging) ఉపకరణాలభాగం C-బ్యాండ్ ట్రాన్స్‌పాండరును కల్గి, ఉపగ్రహం యొక్క కచ్చితమైన రేంజి తెలుపుతుంది.ఇది భూమిపై దిశానిర్దేశం అందించగల ప్రాంత పరిధిని నిర్ధారిస్తుంది. లేజరు రెంజింగుకై కార్నర్ క్యూబ్ రెట్రోరేఫ్లేక్టరును ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈలో పొందుపరచారు.ఉపగ్రహం రెండు వైపుల రెండు సౌరపలకలను అమర్చారు. ఇవి 1660 వ్యాట్ ల విద్యుత్తును ఉత్పత్తి చెయ్యును. దీనికి 90 అంపియర్ అవర్ సామర్ధ్యమున్న లిథియం-అయాన్ బ్యాటరిని అనుసంధానించారు. ఉపగ్రహం 440 న్యూటను శక్తిగల అపోజి మోటరును, 22 న్యూటను శక్తిగల 12 త్రస్టరులను కలిగి ఉన్నది.[2]
ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహన్ని గురువారం,10.03.2016 న సాయంత్రం 4:01 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌక ద్వారా నింగిలోకి పంపారు.ఉపగ్రహ వాహకనౌక విజయవంతంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహన్ని నిర్దేషిత కక్ష్యలో ప్రవేశపెట్టినది.ఉపగ్రహన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాలోఉన్న శ్రీహరికోటలో ఉన్నటువంటి సతిష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కెంద్రం లోని రెండవ ఉపగ్రహ ప్రయోగవేదిక నుండి ప్రయోగించారు.[3]
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రంనుంచి గురువారం (10.03.2016) న సాయంత్రం పిఎస్‌ఎల్‌వి-సీ32 ద్వారా అంతరిక్షంలోకి పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహం కక్ష్యను బెంగళూరు సమీపంలోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుండి పెంచారు. ఈ ఉపగ్రహాన్ని గురువారం భూమికి అతిదగ్గరి కక్ష్యలో (పెరోజి)280 కిలోమిటర్లు, భూమికి దూరపు కక్ష్య (అపోజి)20,600 కిలో మీటర్ల దూరంలో ప్రవేశపెట్టారు.ఈఈ కక్ష్యపరిధిలో ఉపగ్రహం ఒక పరిభ్రమణం చేయుటకు ఆరు గంటలు పడుతుంది.శుక్రవారం (11.03.2016) సాయంత్రం 4:16 గంటలకు ఉపగ్రహంలోని ద్రవ ఇంధన అపోజి మోటరును 20 నిమిషాలపాటు మండించి, ఉపగ్రహ భ్రమణ పెరోజి 280 కిలోమిటర్లు, అపోజి 36,000కిలోమీటర్ల మేరకు పెంచారు.ఈ స్థితిలో ఉపగ్రహ పరిభ్రమణకు/ప్రదక్షణకు 10 గంటల సమయం పడుతున్నది.శనివారం ఉదయం మరొకసారి ఉపగ్రహకక్ష్యను పెంచనున్నారు[4]
12వ తేదిన 1,9185.5సెకన్ల పాటు ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి కక్ష్య దురాన్ని పెంచారు. ఆదివారం (14.ఫిబ్రవరి.2016) కూడా1,561 సెకన్లపాటు ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించిమూడో సారి కక్ష్య దురాన్ని పెంచారు.మరో రెండు దశలలో ఈ కక్ష్య పెంపు ఆపరేసన్ నిర్వహించి, ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్నిభూమికి 36 వేల కిలో మీటర్ల దూరంలోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు కృషి చేస్తున్నారు [5]
భారతీయ ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ, దేశం చుట్టూ 1,500కిలోమీటర్ల వరకు విస్తరించిన ప్రాంతంలో సేవ లందిస్తుంది. ఇది భద్రతా బలగాలకు ఎంతగానో ఉపకరిస్తుంది.వాహనాల గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించటానికి, ఫ్లీట్ నిర్వహణలో సహాయ మందించటానికి ఉపయోగ పడుతుంది.భూతల, ఆకాశ, సాగారాల్లో దిశానిర్దేశ సేవలందిస్తుంది. విమానాలు, ఓడలకు గమనాన్ని తెలియ చేయుటలో సహాయపడును.
పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌకవిజయవంతమైనందులకు తెలుగురాష్ట్రాల ఉమ్మడిగవర్నరుఈఎస్ఎల్ నరసింహన్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలను తెలిపాడు [6] ప్రయోగం విజయవంతమవడం పై రాష్ట్రపతి ప్రణవ్, ప్రధాని మోదీ, చంద్రబాబు సంతోషం వ్యక్తం చేసారు, ఇస్రో శాస్త్ర వేత్తల బృందాన్ని అభినందించారు[7][8]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)