ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
![]() | ఈ వ్యాసంలోని పదజాలం అంశాన్ని వ్యక్తిగత ధోరణిలో వాస్తవిక సమాచారంతో సంబంధం లేకుండా ప్రశంసిస్తున్న ధోరణిలో ఉంది. (September 2014) |
ITC Grand Chola | |
---|---|
దస్త్రం:ITC Welcomgroup Logo.svg | |
Grand Chola (centre), amidst surrounding buildings | |
హోటల్ చైన్ | ITC Welcomgroup Hotels, Palaces and Resorts |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | Chennai, India |
చిరునామా | 63, Anna Salai, Guindy Chennai, Tamil Nadu 600 032 |
ప్రారంభం | 15 September 2012 |
యజమాని | ITC Hotels |
యాజమాన్యం | ITC Welcomgroup |
ఎత్తు | 49 మీ. (161 అ.) |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 15 |
నేల వైశాల్యం | 1,624,000-square-foot (150,900 మీ2) |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | SRSS Architects (Singapore) |
అభివృద్ధికారకుడు | Larsen & Toubro |
ఇతర విషయములు | |
గదుల సంఖ్య | 600 |
సూట్ల సంఖ్య | 14 |
రెస్టారెంట్ల సంఖ్య | 10 |
పార్కింగ్ | 800 cars |
జాలగూడు | |
itchotels.in/ITCGrandChola |
భారతదేశంలో అతి విలాసవంతమైన హోటల్ చెన్నై నగరంలో ఐటీసీ గ్రాండ్ చోలా ఫైవ్ స్టార్ హోటల్. ప్రపంచంలోనే అతిపెద్ద లీడ్ సంస్థ నుంచి గ్రీన్ హోటల్ సర్టిఫికెట్ అందుకున్న హోటల్ ఇది. ముంబయిలోని గూండీ ప్రాంతంలోని ఎస్.పి.ఐ.సి.[1] భవనం ఎదురుగా అశోకా లే లాండ్ టవర్స్ ఉన్న వరుసలోనే ఈ హోటల్ కూడా ఉంటుంది. సింగపూర్ కు చెందిన ప్రముఖ ఎస్ఆర్ఎస్ఎస్ అనే నిర్మాణ సంస్థ చోలా హోటల్ ను డిజైన్ చేసింది. చోల సామాజ్యం, ద్రవిడుల నిర్మాణ కౌశలాన్ని మేలవించి ఆనాటి సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా మూడు విభాగాలను డిజైన్ చేశారు. ఇది స్టార్ వుడ్ హోటళ్ల సముదాయంలోనే... తొమ్మిదవ “విలాసమైన కలెక్షన్లు” చేసే హోటల్ గా గుర్తింపు పొందింది.1,600,000 చదరపు అడుగుల భారీ వైశాల్యం ఉన్న స్థలంలో ఈ హోటల్ ను నిర్మించారు. భారతదేశంలోనే ఒంటరి నిల్చొన్న అతి పెద్ద హోటల్ గా ఐటీసీ గ్రాండ్ చోలా హోటల్ పేరు గడించింది.[2] రూ. 12,000 మిలియన్ల భారీ మొత్తాన్ని ఈ హోటల్ నిర్మాణం కోసం ఖర్చు చేసారు.
ఐటీసీ సంస్థ హోటళ్ల విభాగంలోకి ప్రవేశించిన తర్వాత తొలిసారిగా మద్రాస్ (చెన్నై) లో చోలా షెరటాన్ హోటల్ ను ప్రారంభించింది. దీని పేరును ఇటీవలే మై ఫార్చూన్ గా మార్చారు. చెన్నైలోని అన్నా సాలై ఏరియాలో ఉన్న క్యాంపాకోలా క్యాంపస్ లోని 8 ఎకరాల స్థలాన్ని రూ. 800 మిలియన్ల ఖర్చుతో 2000 సంవత్సరంలో ఐటీసీ హోటళ్ల గ్రూపు కొనుగోలు చేసింది. భారీ పెట్టుబడుల్లో భాగంగా సంస్థ ఛైర్మన్ వై.సి.దేవేశ్వర్ అప్పట్లో రూ. 8,000-10,000 మిలియన్ల రూపాయలతో ప్రాథమికంగా హోటల్ నిర్మాణం చేపట్టాలని భావించారు. 2012 సెప్టెంబరు 15లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈహోటల్ ను ప్రారంభించారు.[3] షరటాన్ చోలా హోటల్ ఆ తర్వాత తన చిరునామాను మార్చుకుని ఐటీసీ గ్రాండ్ చోలా పేరుతో ప్రారంభమైంది.
దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో మాదిరిగా సరిగ్గా అలాంటి నిర్మాణ కౌశల్యాన్ని (ఆర్కిటెక్చర్) ను ఈ హోటల్ పోలి ఉంటుంది. “వల్లవాన్(ఉత్తరం)”, “సెంబియాన్(తూర్పు)”, “కిల్లి(పడమర)” మరియ “చోల(దక్షిణం)” పేర్లతో నాలుగు సూట్లు ఇందులో ఉన్నాయి. ఇవిగాకుండా 43 ఏక పడక గదులు, 33 రెండు గదులు, 2 రెండు పడక గదుల అపార్టుమెంట్లు ఉన్నాయి. పొడవైన స్థంబాలతో, వేలాడే మెట్లతో అచ్చమైన ఆలయ నిర్మాణాలను తలపిస్తుంది ఈ హోటల్.[4]
గ్రాండ్ చోలా హోటల్ పర్యావరణ పరిరక్షణకు, చెట్ల పెంపకానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. హోటల్ నుంచి వెలునీటిని తిరిగి వాడుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంది. హోటల్ అవసరాల కోసం 12.6 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ ను సొంతంగా ఏర్పాటు చేసుకుంది.[4] హోటల్ కోసం వాడుకోగా మిగిలిన విద్యుత్ ను తమిళనాడు విద్యుత్ బోర్డుకు సరఫరా చేస్తోంది.[5] హార్టమన్ లూప్ సాంకేతిక పరిజ్ఞానంతో వేడినీటిని తయారు చేసుకోవడం, ఏసీలు నడిపేందుకు వాడుతున్నారు.[4] నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
అధునాతన సౌకర్యాలతో ఉన్న ఐ.టి.సి. గ్రాండ్ చోలా హోటల్లో మొత్తం 600గదులున్నాయి. 1,600,000 చదరపు అడుగుల (150,000 చ.మీ) నిర్మాణ వైశాల్యం దీని సొంతం. విశాలమైన మైదానం, 100,000చ. అడుగుల వైశాల్యంలో కాన్ఫే రెన్స్ హాల్, 26, 540 చదరపు అడుగుల వైశాల్యంతో రాజేంద్ర హాల్ పేరుతో అతి తక్కువ పిల్లర్లు విందుగది వంటి అనేక ప్రత్యేకతలున్నాయి.[4] అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్ భవనాలకు అవార్డులు అందించే శక్తి, పర్యావరణ డిజైన్ (ఎల్.ఇ.ఇ.డి.) సంస్థ నుంచి ప్లాటినమ్ రేటింగ్ పొందిన హోటల్ ఇది. ప్రపంచంలో ప్రస్తుతానికి ప్రపంచంలోనే గ్రీన్ హోటల్ అవార్డు పొందిన అతి పెద్ద హోటల్ ఇదే.[6] త్వరలోనే హోటల్ పై అంతస్తు డాబాపై హెలిపాడ్ నిర్మాణానికి కూడా యాజమాన్యం యోచిస్తోంది అవార్డులు, రేటింగ్స్ [7]
గ్రాండ్ చోలా హోటల్ అనుసరిస్తున్న పర్యావరణ రక్షణ చర్యలకు గానూ 2013 ఫిబ్రవరిలో 5 స్టార్ జి.ఆర్.ఐ.హెచ్.ఎ. రేటింగ్ గల అవార్డును “ది ఎనర్జీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(టి.ఇ.ఆర్.ఐ.)” నుంచి పొందింది., యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుర్ ఎనర్జీ (ఎం.ఎన్.ఆర్.ఇ.) తరపున రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కూడా ఈ హోటల్ ఆవార్డును అందుకుంది.[8] ఇవిగాక ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన విఖ్యాత హోటల్ గా గ్రాండ్ చోలా హోటల్ పేరు గడించింది.[9]
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)