ఐతే (2003 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చంద్రశేఖర్ యేలేటి |
---|---|
నిర్మాణం | గుణ్ణం గంగరాజు, వెంకట్ డేగా |
తారాగణం | పవన్ మల్హోత్రా, వీరేంధ్రచౌహాన్, మోహిత్.చడ్డా, శశాంక్, జనార్ధన్, అభిషేక్, సిందు తొలానీ |
సంగీతం | కళ్యాణీ మాలిక్ |
నేపథ్య గానం | ఎం. ఎం. కీరవాణి |
గీతరచన | సిరివెన్నెల సీతారామ శాస్త్రి |
సంభాషణలు | గంగరాజు గుణ్ణం |
ఛాయాగ్రహణం | కె. కె. సెంథిల్ కుమార్ |
కళ | రవీంధర్.ఆర్ |
కూర్పు | సుధాకర్ |
నిర్మాణ సంస్థ | జస్ట్ ఎల్లో ప్రెజంట్స్ |
దేశం | భారతదేశము |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఐతే (ఇంగ్లీష్: If so) 2003 భారతీయ తెలుగు భాషా థ్రిల్లర్ చిత్రం చంద్రశేఖర్ యేలేటి ధాని రచన, దర్శకత్వం. ఈ చిత్రం అండర్ వరల్డ్ యొక్క క్రిమినల్ నెక్సస్, కిడ్నాప్ గురించి వివరిస్తుంది. ఈ చిత్రం తెలుగులో ఆ సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రాన్ని తమిళంలో నామ్ (2003), మలయాళంలో వాంటెడ్ (2004) గా నిర్మించారు. ఈ చిత్రాన్ని 2007 లో 50 లక్షలుగా హిందీలోకి డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం 1997 చిత్రం సూసైడ్ కింగ్స్ నుండి ఎక్కువగా ప్రేరణ పొందింది.
రాము, కుమార్, శంకర్, వివేక్, అదితి స్నేహితులు. అందరూ మధ్యతరగతి వారే ఎవరి ఖర్చులు వారికి భారంగా ఉంటాయి.
ఇర్ఫాన్ఖాన్ (పవన్ మల్హోత్రా) ఒక దేశద్రోహి. అతడిని పట్టుకొంటే యాభై లక్షల బహుమతి ప్రకటిస్తుంది ప్రభుత్వం. అతడు దేశంనుండి తప్పించుకొని దుబాయ్ పారిపోవాలనే ప్రయత్నం చేసి ఇంటర్ పోల్ వలన విఫలమవుతాడు. మరొక లోపాలులేని ప్రయత్నం చేయాలనుకొంటాడు. దానికి నలుగురు కొత్తకుర్రాళ్ళను ఇబ్బందులు ఉండి డబ్బు అవసరం కలవాళ్ళను చూడమని చెప్తాడు తన అనుచరుడు ముషారఫ్ (వీరేంద్ర చౌహాన్) తో.
అతడు వీళ్ళను కుమార్ ద్వారా అప్రోచ్ అవుతాడు. ప్లానుకు ఒప్పుకొన్న వారు తరువాత మనసు మార్చుకొని కొత్త ప్లాను వేస్తారు. ఇర్ఫాన్ ఖాన్ యొక్క వివిధ రూపాల పొటోలను అదితిచే గీయిస్తారు. అందరి వద్ద మరికొంత డబ్బు సేకరించి ఒక సారి విమాన ప్రయాణం చేసి అనుభవం సంపాదిస్తారు. తరువాత ఇర్ఫాన్ ఖాన్ మారువేషంలో తప్పించుకోవడానికి నేపాల్ భయలు దేరిన విమానంలో వీరూ భయలుదేరి ఎవరికీ తెలియకండా అతడికి మత్తు ఇచ్చి మా మామయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చిందని నాటకమాడి అతనితో పాటుగా నలుగురూ హాస్పిటలుకు భయలుదేరి మధ్యలో అతడిని తప్పించి అడవిలో బంధిస్తారు. తరువాత అదితి ద్వారా ఫోన్లో పోలీసులతో బేరాలు సాగిస్తారు. అయితే పోలీస్ కమీషనర్ ఇర్ఫాన్ ఖాన్ మనిషి కావడంతో బహుమతి డబ్బును ఇచ్చేందుకు ఒప్పుకొన్నట్టుగా నటించి ఇర్ఫాన్ ఖాన్ను అప్పగించమని చెప్తాడు. అడవి దారిలో ఒక ప్రదేశానికి డబ్బు తీసుకురమ్మని ఒకే ఒక కారులో రమ్మని చెప్తారు. చిన్న కొండపై ఇర్ఫాన్ ఖాన్ను ఉంచి క్రింద రోడ్దుపై ఇద్దరు కొంతదూరంలో ఒకరు ఎదురు చూస్తుంటారు. అప్పటికే ఈ గ్యాంగుపై అనుమానంతో పరిశోధన సాగిస్తున్న ఇంటర్ పోల్ వీరిని అనుసరిస్తుంటారు. ఆకొండ ప్రాంతం కొచ్చేసరికి వారికి వీరికి కాల్పులు జరుతాయి. ఇదంతా చూసిన నలుగురూ ఇర్ఫాన్ ఖాన్ను తప్పించే ప్రయత్నంలో అతడు పారిపోతాడు. అప్పటికి ఇర్ఫాన్ ఖాన్ ముఠాపై పై చేయి సాగించిన ఇంటర్ పోల్ డిప్యూటీ డైరెక్టర్ జహీర్ (శివాజీరాజా) తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఇర్ఫాన్ ఖాన్నుకూడా పట్టుకొంటాడు.
ఇర్ఫాన్ ఖాన్ గా పవన్ మల్హోత్రా
ముషారఫ్ గా వీరేంద్ర చౌహాన్
రాము గా మోహిత్ చద్దా
కుమార్ గా శశంక్
శంకర్ గా జనార్థన్
వివేక్ గా అభిషేక్
అదితి గా సింధు తులాని
కవిత గా లిఖిత
హోం మినిస్టర్ గా నర్సింగ్ యాదవ్
జహీర్ ఖాన్ గా శివాజీ రాజా
వివేక్ తండ్రిగా సి.వి.ఎల్ .నరసింహారావు
మదన్ సేతు గా అశోక్ కుమార్
చోటు గా హర్షవర్ధన్
ఎ సి.పి. గా సంజయ్ రాయ్ చుర
ఐ.బి.చీఫ్ గాలలిత్ శర్మ.
చిటపట చినుకులు, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం. ఎం ఎం కీరవాణి.