ఐరా | |
---|---|
![]() | |
దర్శకత్వం | సర్జున్ |
రచన | ప్రియాంక రవీంద్రన్ |
నిర్మాత | కోటపాడి జె రాజేష్ |
తారాగణం | నయన తార యోగి బాబు |
ఛాయాగ్రహణం | సుదర్శన్ శ్రీనివాస్ |
కూర్పు | కార్తీక్ జోగేష్ |
సంగీతం | సుందర మూర్తి కె.ఎస్ |
నిర్మాణ సంస్థ | కేజేఆర్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 28 మార్చి 2019 |
సినిమా నిడివి | 142 నిమిషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
ఐరా 2019లో విడుదలైన తెలుగు సినిమా. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై కోటపాడి జె రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు సర్జున్ దర్శకత్వం వహించాడు. నయనతార, యోగిబాబు, జయప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 మార్చి 28న విడుదలైంది.[1]
యమున (నయనతార) వైజాగ్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తుంటుంది. ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందని ఆమె సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ని పెట్టాలనుకుంటుంది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తారు. యమున ఇష్టం లేని ఉద్యోగంతోపాటు పెళ్లిని తప్పించుకోవడం కోసం ఇంట్లో చెప్పకుండా ఒంగోలులోని తన అమ్మమ్మ (లీలావతి) ఇంటికి వెళ్లిపోతుంది. అక్కడికి వెళ్లిన ఆమె ఆ ఊర్లో ఉంటూ దెయ్యాలపై కొన్ని వీడియోలు తీసి యూ ట్యూబ్ లో పెడుతూ జనాలని ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో యమున బామ్మ చనిపోతుంది. యమున అప్పుడే ఆ బంగ్లాలో నిజంగా దెయ్యం ఉందని తెలుసుకుంటుంది. ఇంతకీ ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం ఎవరు? చివరికి ఆ దెయ్యం ఏమయ్యింది? అనేదే మిగతా సినిమా కథ.[2][3]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)