ICC Women's Championship | |
---|---|
నిర్వాహకుడు | International Cricket Council (ICC) |
ఫార్మాట్ | WODI |
తొలి టోర్నమెంటు | 2014–16 |
చివరి టోర్నమెంటు | 2022–25 |
జట్ల సంఖ్య | 10 |
ప్రస్తుత ఛాంపియన్ | ఆస్ట్రేలియా (2nd title) |
అత్యంత విజయవంతమైన వారు | ఆస్ట్రేలియా (2 titles) |
ఐసిసి మహిళల ఛాంపియన్‌షిప్ (IWC) అనేది మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు అర్హతను నిర్ణయించడానికి ఉపయోగించే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంటు. [1] మొదటి రెండు టోర్నమెంటులలో ఐసిసి మహిళల ర్యాంకింగుల్లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లు పోటీపడ్డాయి. మొదటి ఎడిషనైన 2014–16 ఐసిసి ఉమెన్స్ ఛాంపియన్‌షిప్, 2014 ఏప్రిల్లో మొదలై 2016 నవంబరులో ముగిసింది. తొలి టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. [2] టోర్నమెంటు రెండవ ఎడిషను 2017 అక్టోబరులో మొదలైంది. మొదటి నాలుగు జట్లు 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు ఆటోమాటిగ్గా అర్హత సాధిస్తాయి. [3]
2018 సెప్టెంబరులో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాము IWCని మొత్తం పది జట్లకు విస్తరించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. అందువల్ల భవిష్యత్తులో బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లు కూడా ఉంటాయని చెప్పింది. [4] [5] 2021 ఆగస్టులో, ఐసిసి 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటు నుండి మూడు క్వాలిఫైయరు జట్లు, తదుపరి రెండు ఉత్తమ స్థానాల్లో ఉన్న జట్లూ తదుపరి IWC సైకిల్‌కు అర్హత సాధిస్తాయని ధృవీకరించింది. [6] [7] అయితే, 2021 నవంబరులో, దక్షిణాఫ్రికాలో COVID-19 కొత్త రూపాంతరం వ్యాపించడంతో, [8] క్వాలిఫైయరు టోర్నమెంటును మధ్యలో నిలిపేసారు. [9] అందువల్ల బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లు తమ వన్‌డే ర్యాంకింగ్స్ ఆధారంగా 2022–25 సైకిల్లో [10] IWCలో చేరాయి. [11]
సంవత్సరం | జట్లు | విజేత | నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది | ప్రపంచకప్ క్వాలిఫయర్‌కు చేరుకుంది |
---|---|---|---|---|
2014–16 | 8 | ఆస్ట్రేలియా | ఇంగ్లాండు , న్యూజీలాండ్ , వెస్ట్ ఇండీస్ | భారతదేశం , దక్షిణాఫ్రికా , పాకిస్తాన్ , శ్రీలంక |
2017–20 | 8 | ఆస్ట్రేలియా | ఇంగ్లాండు , దక్షిణాఫ్రికా , భారతదేశం , న్యూజీలాండ్ | పాకిస్తాన్ , వెస్ట్ ఇండీస్ , శ్రీలంక |
2022–25 | 10 |
జట్టు | 2014–16 (8) |
2017–20 (8) |
2022–25 (10) |
యాప్‌లు. |
---|---|---|---|---|
ఆస్ట్రేలియా | 1వ | 1వ | ప్ర | 3 |
బంగ్లాదేశ్ | ఆడలేదు | ప్ర | 1 | |
ఇంగ్లాండు | 2వ | 2వ | ప్ర | 3 |
భారతదేశం | 5వ | 4వ | ప్ర | 3 |
ఐర్లాండ్ | ఆడలేదు | ప్ర | 1 | |
న్యూజీలాండ్ | 3వ | 6వ | ప్ర | 3 |
పాకిస్తాన్ | 7వ | 5వ | ప్ర | 3 |
దక్షిణాఫ్రికా | 6వ | 3వ | ప్ర | 3 |
శ్రీలంక | 8వ | 8వ | ప్ర | 3 |
వెస్ట్ ఇండీస్ | 4వ | 7వ | ప్ర | 3 |