ఐస్ క్రీమ్ 2 | |
---|---|
![]() ఐస్ క్రీమ్ 2 సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | రామ్ గోపాల్ వర్మ |
రచన | రామ్ గోపాల్ వర్మ |
నిర్మాత | తుమ్మలపల్లి సత్యనారాయణ |
తారాగణం | జె. డి. చక్రవర్తి నవీన జీవా |
ఛాయాగ్రహణం | అంజి |
కూర్పు | నాగేంద్ర అడప |
సంగీతం | సంగ ప్రతాప్ కుమార్ |
నిర్మాణ సంస్థ | భీమవరం టాకీస్ |
విడుదల తేదీ | 21 నవంబరు 2014 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | 10 కోట్లు |
ఐస్ క్రీమ్ 2 2014, నవంబరు 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి సత్యనారాయణ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన, జె. డి. చక్రవర్తి జంటగా నటించగా, సత్య కశ్యప్ సంగీతం అందించాడు.[1][2][3][4] ఐస్ క్రీమ్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.[5]
ఐదుగురు స్నేహితులు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తియ్యాలనుకొని అడవిలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళకు వింత వింత అనుభూతులు ఎదురవుతుంటాయి. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునే టైంలో బ్యాంక్ దొంగతనాలు చేసే సిక్క (జెడి చక్రవర్తి) అతని గ్యాంగ్ తో కలిసి ఈ ఐదుగురిని కిడ్నాప్ చేస్తాడు. ఆ కిడ్నాప్ జరిగిన రోజు నుంచి ఆ గ్యాంగ్ లో ఒక్కొక్కరూ చంపబడుతూ ఉంటారు. ఆ అడవిలో వాళ్ళని ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, చివరికి ఎవరన్నా బతికారా అన్నది మిగతా కథ.[6]
ఈ సినిమాకి సత్య కశ్యప్ సంగీతం అందించాడు. ఈ3 మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
ఐస్ క్రీమ్ 2 | ||||
---|---|---|---|---|
పాటలు by సత్య కశ్యప్ | ||||
Released | సెప్టెంబరు 23, 2014 | |||
Recorded | 2014 | |||
Genre | పాటలు | |||
Length | 14:08 | |||
Label | ఈ3 మ్యూజిక్ | |||
Producer | సత్య కశ్యప్ | |||
సత్య కశ్యప్ chronology | ||||
|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "కిస్ మీ" | సునీత ఉపద్రష్ట | 4:07 | ||||||
2. | "చల్ల చల్లగా" | ఉమా నేహ, అక్షర పరాషర్ | 2:53 | ||||||
3. | "కిస్ మీ (రిమిక్స్)" | సునీత ఉపద్రష్ట | 3:49 | ||||||
4. | "ఐస్ క్రీమ్ థీమ్" | వాయిద్యం | 3:19 | ||||||
24:38 |
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)