ఒబైద్ సిద్దిఖి | |
---|---|
![]() | |
జననం | జనవరి 7, 1932 |
మరణం | 2013 జూలై 26 | (వయసు: 81)
పౌరసత్వం | భారతీయుడు |
రంగములు | బయాలజీ |
చదువుకున్న సంస్థలు |
|
పరిశోధనా సలహాదారుడు(లు) | గైడో పోంటెకోర్వో |
ముఖ్యమైన విద్యార్థులు | వెరోనికా రోడ్రిగ్స్ |
ముఖ్యమైన పురస్కారాలు | పద్మభూషణ్ (1984)
పద్మవిభూషణ్(2006) |
ఒబైద్ సిద్దిఖి (జనవరి 7, 1932 – జూలై 26, 2013) ఒక భారతీయ బయాలజీ శాస్త్రవేత్త. ఈయన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఫ్ఆర్) నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ వ్యవస్థాపకుడు.[1] ఈయన పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత.[2]
ఈయన 1932, జనవరి 7 న ఉత్తర ప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో జన్మించాడు. ఈయన అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. ఈయన తన ఎమ్. ఎస్సీ. పిహెచ్‌డి విద్యను గైడో పోంటెకోర్వో పర్యవేక్షణలో గ్లాస్గో విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. ఈయన తన పోస్ట్ డాక్టోరల్ పరిశోధనను కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లాబొరేటరీ, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్ లోని ఎమ్.ఆర్. సి. ప్రయోగశాలలో పూర్తిచేసాడు. ఈయనను 1962 లో ముంబాయిలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఫ్ఆర్) లో మాలిక్యులర్ బయాలజీ యూనిట్‌ను ఏర్పాటు చేయమని హోమి భాభా ఆహ్వానించాడు. ముప్పై సంవత్సరాల తరువాత, బెంగళూరులోని టిఎఫ్ఆర్ నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ వ్యవస్థాపించి, డైరెక్టర్ గా పనిచేశాడు.
సెంట్రల్ యూనివర్శిటీ