ఓరు వడక్కన్ వీరగాథ | |
---|---|
దర్శకత్వం | హరిహరన్ |
రచన | ఎం.టి.వాసుదేవన్ నాయర్ |
నిర్మాత | పివి గంగాధరన్ |
తారాగణం | మమ్ముట్టి, బాలన్ కె. నైర్, సురేష్ గోపీ, మాధవి, గీత, కెప్టెన్ రాజు |
ఛాయాగ్రహణం | కె. రామచంద్రబాబు |
కూర్పు | ఎం.ఎస్. మణి |
సంగీతం | బొంబాయి రవి |
నిర్మాణ సంస్థ | గృహలక్ష్మీ ప్రొడక్షన్ |
పంపిణీదార్లు | కల్పక ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 14 ఏప్రిల్ 1989 |
సినిమా నిడివి | 168 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
ఓరు వడక్కన్ వీరగాథ, 1989 ఏప్రిల్ 14న విడుదలైన మలయాళం పౌరాణిక సినిమా. హరిహరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎం.టి.వాసుదేవన్ నాయర్, మమ్ముట్టి, బాలన్ కె. నైర్, సురేష్ గోపీ, మాధవి, గీత, కెప్టెన్ రాజు తదితరులు నటించారు.[1] 1989లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడు (మమ్ముట్టి), జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే (ఎంటి వాసుదేవన్ నాయర్), జాతీయ ఉత్తమ కళా దర్శకుడు, జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ (పి. కృష్ణమూర్తి ) వంటి నాలుగు విభాగాలలో, కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో ఏడు అవార్డులను గెలుచుకుంది.
ఓరు వడక్కన్ వీరగాథ వాణిజ్యపరంగా, విమర్శకుల ప్రశంసలను అందుకుంది.[3]
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. థియేటర్లలో 375 రోజులు నడిచింది. [4]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు