బ్రిటీష్ వలస పాలనలో, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలలో కార్మికులను నియామకం చేసిన వ్యవస్థ, కంగానీ వ్యవస్థ. 19వ శతాబ్దం ప్రారంభం నుండి 20వ శతాబ్దం ప్రారంభం వరకు ఇది అమలులో ఉంది. ప్రత్యేకించి ఇప్పటి మయన్మార్, మలేషియా, శ్రీలంక దేశాల్లో ఈ పద్ధతిలో నియామకాలు జరిగాయి. ఈ వ్యవస్థ ఒప్పంద దాస్యాన్ని పోలి ఉంటుంది. ఈ రెండూ ఒకే కాలంలో అమలులో ఉండేవి. 19వ శతాబ్దం చివరి నుండి కంగానీ వ్యవస్థ మరింత ప్రజాదరణ పొందింది. కంగానీ వ్యవస్థలో, నియామకం, నిర్వహణ కంగాని అనేవ్యక్తి (తమిళంలో ఫోర్‌మాన్ అని అర్థం) చేసేవారు. వీరు భారతదేశం నుండి వలస రాదల్చిన వారిని - ముఖ్యంగా తమిళులను- నేరుగా రిక్రూట్ చేసుకునేవారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర పరిచయస్థుల నెట్‌వర్క్‌ల ద్వారా ఈ నియామకాలు జరిగేవి. పని ప్రదేశంలో ఈ కార్మికులను పర్యవేక్షించే బాధ్యత కూడా ఈ కంగానీలదే. [1] ఈ వలసదారుల సమూహాల నాయకుడికి వారి వ్యవహారాలపై గట్టి పట్టు ఉంటుంది. ఈ కంగానీలు కార్మికుల వేతనాల్లోంచి కొంత భాగాన్ని చట్టవిరుద్ధంగా మినహాయించుకుని, తద్వారా ఆ కార్మికులను ఒక అప్పు-వెట్టిచాకిరీ విషయ వలయం లోకి దించుతారు. చిన్న చిన్న సమూహాలలోనైతే, ఈ కంగానీలు తమ పర్యవేక్షణ బాధ్యతలతో పాటు కార్మికులుగా కూడా పని చేసేవారు. కానీ పెద్ద సమూహాలలో వారి పాత్ర పూర్తిగా ఆజమాయిషీ, పర్యవేక్షణ, భూ యజమానితో వ్యవహరించడం - ఇవే ఉంటాయి. [2] ఒక సమయంలో బర్మాలో ఉన్న భారతీయ కార్మికులలో దాదాపుగా ప్రతి 8 మందిలో ఒకరు కంగానీగా ఉండేవారు. కొన్ని అంచనాల ప్రకారం, కొంతమంది రిక్రూటర్, సూపర్‌వైజర్ పాత్రలో అడుగుపెట్టడం, దానితో పాటు ఆదాయం, హోదా పెరగడం వంటి సామాజిక ఎదుగుదలను సాధించడం కార్మికులకు అంత కష్టంగా ఏమీ ఉండేది కాదని కొందరు అంటారు. [3]
{{cite book}}
: CS1 maint: others (link)