కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా | |
---|---|
Container_Corporation_of_India_logo.svg | |
తరహా | పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ |
స్థాపన | {{{foundation}}} |
ప్రధానకేంద్రము | |
పరిశ్రమ | రవాణా |
ఉత్పత్తులు | కంటెయినర్ టెర్మినళ్ళు ఇంటర్‌మోడల్ ఫ్రైట్ ట్రాన్స్‌పోర్ట్ |
రెవిన్యూ | ₹9,023 crore (US$1.1 billion) (2024)[1] |
నిర్వహణ లాభం | ₹1,638 crore (US$210 million) (2024)[1] |
నికర ఆదాయము | ₹1,232 crore (US$150 million) (2024)[1] |
మొత్తం ఆస్తులు | ₹14,038 crore (US$1.8 billion) (2024)[2] |
మొత్తం ఈక్విటీ | ₹11,823 crore (US$1.5 billion) (2024)[2] |
యజమాని | Government of India |
ఉద్యోగులు | 1,400 (2021 మార్చి) [2] |
అనుబంధ సంస్థలు | *CONCOR ఎయిర్ లిమిటెడ్
|
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( CONCOR ) అనేది భారత ప్రభుత్వ రంగ సంస్థ, ఇది కంటైనర్‌ల రవాణా, నిర్వహణలో నిమగ్నమై ఉంది. కంపెనీల చట్టం కింద 1988 మార్చిలో దీన్ని ఏర్పాటు చేసారు. CONCOR 1989 నవంబరులో భారతీయ రైల్వేల నుండి ఏడు ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోల (ICDలు) నెట్‌వర్క్‌ను అందుకుంది.[3]
కార్గో రవాణాను కంటైనరు పద్ధతి లోకి మార్చడానికి భారతీయ రైల్వేలు వేసిన ఈ వ్యూహాత్మకమైన అడుగుతో భారతదేశం 1966 లో మొదటిసారిగా ఇంటర్‌మోడల్ ఫ్రైట్ ట్రాన్స్‌పోర్ట్ మ్యాప్‌లో చేరింది. భారతదేశ పరిమాణాన్ని బట్టి (దాదాపు 3,000 కిలోమీటర్లు (1,900 మై.) ఉత్తరం నుండి దక్షిణానికి, తూర్పు నుండి పడమరకు), మధ్యస్థ, సుదూర దూరాలకు అన్ని సరుకుల కోసం రైలు రవాణా చౌకైన ఎంపిక -ప్రత్యేకించి ఇంటర్-మోడల్ బదిలీల ధరను తగ్గించగలిగితే. కంటెయినరైజ్డ్ మల్టీ-మోడల్ డోర్-టు-డోర్ ట్రాన్స్‌పోర్ట్ ఈ సమస్యకు పరిష్కరిస్తుందని భావించి, 1966 లో భారతీయ రైల్వే ప్రత్యేక DSO కంటైనర్‌లలో ఇంటింటికీ దేశీయ కార్గోను తరలించడానికి మార్కెట్‌లోకి ప్రవేశించింది.
భారతదేశంలోని మొదటి ISO కంటైనర్ 1973 లోనే కొచ్చిలో నిర్వహించబడినప్పటికీ, మొదటి ISO కంటైనర్‌ను భారతీయ రైల్వేలు దేశంలోనే మొట్టమొదటి ICD కి తరలించినది మాత్రం 1981 లోనే. బెంగళూరులోని ఈ ICD ని కూడా భారతీయ రైల్వేయే నిర్వహిస్తోంది.
1988 నాటికి నెట్‌వర్క్‌ను ఏడు ICDలకు విస్తరించడం వల్ల కంటైనర్ నిర్వహణ సామర్థ్యం పెరిగింది. అదే సమయంలో భారతదేశంలో కంటెయినరైజేషన్ వృద్ధిని ప్రోత్సహించడానికీ, నిర్వహించడానికీ ప్రత్యేక ప్రో-యాక్టివ్ సంస్థ ఒకదాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బలమైన అభిప్రాయం ఉద్భవించింది.[4][5]
ప్రైవేటీకరణ చేసిన భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో CONCOR ఒకటి.[6] మరోసారి భారత ప్రభుత్వం తన 54.8% వాటాలో 30.8% ని విక్రయించాలని ఆశించింది. మొదట 2021–2022 ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతుందని అంచనా వేసినా, తరువాతి ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేసారు.[6] 2022 ఏప్రిల్‌లో, భారత ప్రభుత్వం ఇండియన్ రైల్వేస్ ల్యాండ్ లైసెన్సింగ్ రుసుమును భూమి మార్కెట్ విలువలో 6% నుండి 3%కి తగ్గించింది. కంపెనీ ప్రైవేటీకరణలో సహాయపడటానికి ఈ చర్య తీసుకున్నారు.[7]
CONCOR మూడు ప్రధాన వ్యాపారాలను నిర్వహిస్తుంది: కార్గో క్యారియర్ ; టెర్మినల్ ఆపరేటర్, గిడ్డంగి ఆపరేటర్ & MMLP ఆపరేషన్.