కగుర సుజు అనేవి కగుర నృత్యంలో వాడే పన్నెండు గంటలతో కూడిన పరికరం.[1][2] దీనిలో, ఈ గంటలు మూడు ఆంతరాలలో ఇత్తడి తీగతో ఒక చేతి కర్రకు మధ్యగా, రెండు గంటలు పై అంతరంలో, నాలుగు మధ్య అంతరంలో, మిగతా ఆరు క్రింది అంతరంలో వేలాడేలా చుట్టి ఉంటాయి. గంటల ఆకారం ఒగాటమా చెట్టు (మిచెలియా కంప్రెసా) పండ్ల ప్రేరణ తో రూపొందించినట్టుగా ఉంటాయి.
సుజు అనే పదం సాధారణంగా చిన్న గంటలను సూచిస్తుంది.కానీ, అది జపాన్ కి చెందిన షింటో సాంప్రదాయపు రెండు పరికరాలను సూచిస్తుంది:[3]
పెద్ద మువ్వ గంటని షింటో మందిరం ముందు ఉన్న దూలానికి కట్టి, దానికి మోగించటానికి వీలుగా ఒక రిబ్బన్ లాంటి వస్త్రం ఆరాధకుడికి అందుబాటులోఉండేలా కడతారు. ఇక చిన్న సుజు ఒక చేతి కర్రపై కట్టిన మువ్వాలతో ఉంతుంది. కగురా నృత్యాల ప్రదర్శనల సమయంలో సాంప్రదాయ వస్త్రాలు, తెల్లటి పొడి పూసిన ముఖాలు హీయాన్-కాలపు అలంకారపు తలకట్టుతో (కోఫియర్) ఉన్న మందిర పరిచారికలు (మికో ) లు చేతిలో పట్టుకుంటారు.
కగుర (神楽, "దైవ వినోదం ") అనేది షింటోకి చెందిన వాయిద్య సంగీతం, గీతాలు, నృత్యలతో కూడిన వినోదం. ఇది దైవ మందిరాల్లోనూ, రాజ దర్బారుల్లోనూ ప్రదర్శిస్తుంటారు. ఇది సాంప్రదాయిక ప్రదర్శనగా, 773 నాటికే రాజ దర్బారు ప్రదర్శనల జాబితాలోకి చేరింది. ఈ చిన్న గంటలు, పురాతన ఆచార ఉపకరణాలుగా, జనపదాలలో, ఉత్సవ ప్రదర్శనలలో గుది గుచ్చిన గుత్తులుగా వాడుకలో ఉన్నాయి.
మూస:Traditional Japanese musical instrumentsమూస:Shinto shrine