కత్తిపీట (ఆంగ్లం Boti) అనేది కత్తిరించే పరికరం.[1] దీనిని నేపాల్, బెంగాల్ ప్రాంతలలో ఎక్కువగా వాడుతారు.[2] అదే విధంగా భారతదేశంలోని తూర్పు ప్రాంతాలలోని ప్రజలు ఈ పరికరాన్ని కూరగాయలు కత్తిరించేందులు ఉపయోగిస్తారు.[2]
కత్తిపీట అనగా కత్తిని ఒక కర్రతో చేసిన పీట మీద బిగించి ఉంచే పరికరం. ఈ పరికరాన్ని ఉపయోగించి కూరగాయలు, పండ్లు మొదలైనవి కోయడానికి ఉపయోగిస్తారు. [3] ఇందులోని కత్తి వక్రముగా అమర్చబడి ఉంటుంది. ఒక వస్తువును కోయడానికి రెండు చేతులనుపయోగించి కత్తి అందున ఉంచి బ్లేడుకు వ్యతిరేకంగా బలాన్ని ఉపయోగిస్తారు. కత్తి పదునైన అంచు కోసేవారివైపు ఉంటుంది. [4] ఈ పరికరంతో చిన్న రొయ్యల నుండి పెద్ద గుమ్మడి కాయ వరకు కత్తిరించవచ్చు.
పెద్ద పరిమాణం ఉన్న కత్తి గల కత్తిపీటను చేపలను, మాంసాన్ని కత్తిరించడానికి వాడుతారు. కొన్ని కత్తిపీటలకు కత్తి పై భాగంలో కొబ్బరి చెక్కలను తురుముటకు వేరొక సమతలంగా పదునైన రంపపు అంచులు గల పరికరం అమరి ఉంటుంది.
ఈ పరికరం బెంగాల్‌కు ప్రత్యేకమైనది కాదు. ఇది మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కువగా ఉపయోగించబడుతుంది. దక్షిణ భారతదేశంలో దీని పేర్లు వివిధ రకాలు గా ఉన్నాయి: తమిళం: అరివల్మనై లేదా అరువల్మనై, తెలుగు: కత్తిపీట, కొంకణి: అడిలి, మరాఠీ: విలి లేదా మోర్లి, ఒడియా: పానిఖి, బీహార్: పిర్థై మొదలైనవి. దీనిని నేపాల్ లో చులేసి అని పిలుస్తారు. నేపాల్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కూరగాయలు తరగడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు.
కత్తిపీటతో మాంసాన్ని, చేపలను, కూరగాయలను కోసేటప్పుడు వ్యక్తి కత్తిపీడ క్రింది భాగంలో గల చెక్క పీఠంపై ఒక కాలును బలంగా కత్తిపీట కదలకుండా ఉంచుతారు. కత్తి పదునైన అంచు వ్యక్తి వైపు ఉంటుంది. కత్తిరించవలసిన వస్తువును రెండు చేతులతో పట్టుకొని పదునైన అంచుపై ఉంచు కత్తి అంచుకు వ్యతిరేకంగా బలాన్ని ఉపయోగించాలి.
ప్రస్తుత సమాజంలో మార్పులు వస్తుం డడంతో కత్తిపీట కనుమరుగవుతోంది. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడుతున్న మహిళలు కత్తిపీటకు స్థానంలో కత్తులను ఉపయోగి స్తుండడంతో కనుమరుగవుతున్నాయి. ప్రతిఇంటికి కత్తిపీట తప్పని సరికావడంతో వడ్రంగులు వివిధ రూపాల్లో ప్రత్యేకంగా తయారు చేసేవారు. మహిళలకు అనుకూలంగా వివిధ రకాల సైజుల్లో వడ్రంగుల వద్ద లభించేవి .ప్రస్తుతం మార్కెట్‌లోకి వివిధ రకాల కత్తులు రావ డం కారణంగా ఈలపీటెల వాడకం పూర్తిగా తగ్గింది. [5]