![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కపిలేంద్రదేవ గజపతి లేదా కపిళేశ్వరదేవ (సాశ. 1434-1466) కళింగ-ఉత్కళ (ప్రస్తుతపు ఒడిశా) ప్రాంతపు చక్రవర్తి. గజపతి వంశ స్థాపకుడు.
గజపతులకు పూర్వ సామ్రాజ్యమైన తూర్పు గాంగులు ఆఖరి రాజైన నాలుగవ భానుదేవుల కాలంలో మంత్రియైన కపిలేంద్రుడు తిరుగుబాటు చేసి బలహీనుడైన రాజును హతంచేసి సింహాసనాన్ని కైవసపరచుకొని తన స్వంత సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు.కపిలేంద్ర రౌటరే లేదా శ్రీ శ్రీ కపిలేంద్ర దేవ అను పేర్లతో వీరిని కీర్తించేవారు (ఇందులో రౌటరే అనగా దేవుని సేవకుడు అని అర్థం).
మహాభారత కాలంనాటి సూర్యవంశస్థునిగా పేరొంది నూఱున్నెనిమిది శ్రీ...కారాలతో గజపతి గౌడేశ్వర నవకోటి కర్ణాటోత్కళ కలబర్గేశ్వర అనే బిరుదు కలిగిన వారు.దీనర్థం గౌడ, కర్ణాట, ఉత్కళ, గోలుకొండ, కలబర్గ (గుల్బర్గా) వంటి రాజ్యాలకు చక్రవర్తియై తొమ్మిది కోట్లమందిని ఏలినవాడని అర్థం.
1466లో మరణించే ముందు, తన చిన్నకుమారుడైన పురుషోత్తమ దేవుని వారసునిగా ప్రకటించి మరణించాడు. తత్ఫలితంగా మరో కుమారుడు హమ్వీర దేవుడు తిరుగుబాటు చేశాడు. 1472లో హమ్వీరుడు పురుషోత్తముణ్ణి ఓడించి రాజయ్యాడు. కానీ 1476లో పురుషోత్తమ దేవుడు పోరాడి తిరిగి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు.[1]