కబేరి బోస్ | |
---|---|
జననం | [1] | 1938 నవంబరు 28
మరణం | 1977 ఫిబ్రవరి 18 | (వయసు 38)
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1955–1975 |
గుర్తించదగిన సేవలు | రాజ్‌కమల్ దృష్టి దేవి మాలిని అరణ్యేర్ దిన్ రాత్రి అమీ సే ఓ సఖా |
జీవిత భాగస్వామి | అజిత్ ఛటోపాధ్యాయ (1956) |
పురస్కారాలు | బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ ఉత్తమ సహాయ నటి (1971) |
కబేరి బోస్, బెంగాలీ సినిమా నటి. ఉత్తమ్ కుమార్ సరసన శ్యామాలి సినిమాలో, సత్యజిత్ రే దర్శకత్వం వహించిన అరణ్యేర్ దిన్ రాత్రి సినిమాలో నటించింది.[2][3]
కబేరి 1938 మార్చి 28న జన్మించింది.
కబేరికి 1956లో అజిత్ ఛటోపాధ్యాయతో వివాహం జరిగింది. ఆ తరువాత సినిమారంగాన్ని విడిచి ముంగేరుకు వెళ్ళిపోయింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. 12 సంవత్సరాల విరామం తరువాత 1968లో వచ్చిన అరణ్యర్ దిన్ రాత్రి సినిమాలో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
1970, జూన్ 12న కబేరి తన భర్త, చిన్న కుమార్తెతో కలిసి డార్జిలింగ్ నుండి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె కుమార్తె, భర్త మృతి చెందగా, కబేరి తీవ్ర గాయాలతో బయటపడింది.
దర్శకుడు సుబోధ్ మిత్ర 1955లో దర్శకత్వం వహించిన రాజ్‌కమల్ సినిమా ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది. ఒక సంవత్సరకాలంలో ఏడు బెంగాలీ సినిమాల్లో నటించింది.
1976లో కబేరికి క్యాన్సర్ వ్యాధి సోకింది. 1977, ఫిబ్రవరి 18న మరణించింది.