కమలా చౌదరి, (1908-1970) ఒక భారతీయ హిందీ భాష కథానిక రచయిత.స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త. భారతదేశ చరిత్రను వివిధ రకాలుగా తీర్చిదిద్దిన అనేక మంది మహిళల పేర్లలో, కమలా చౌదరిపేరు మిస్టరీగా కొనసాగుతోంది.1948 లో భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది. అయితే, ఆమె జీవితంలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్లు మినహా, ఆమె గురించి పెద్దగా ఏమీ తెలియదు. నిష్ణాతురాలైన హిందీ రచయిత్రి.[1]
కమలా చౌదరి 1908 ఫిబ్రవరి 22న లక్నోలో జన్మించింది.ఆమె తండ్రి రాయ్ మన్మోహన్ దయాల్ డిప్యూటీ కలెక్టరుగా పనిచేసాడు.[2] ఆమె తల్లి తాత 1857 మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో లక్నోలో స్వతంత్ర అవధ్ దళాలకు కమాండరుగా పనిచేసాడు.సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ, విద్య ఆమెకు సవాలుగా సంభవించింది. చాలా కష్టంతో, ఆమె పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి హిందీ సాహిత్యంలో రత్న, ప్రభాకర్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది. ప్రారంభంలో స్త్రీలపై అణచివేతను చూసిన కమలా చౌదరి , తన అనుభవాలన్నింటినీ ఆమె జీవితంలో తరువాత కథలుగా రూపొందించడానికి ఉపయోగించింది. ఆమె తీవ్రమైన పరిశీలకురాలు. ఇది ఆమె రచనలలో, సామాజిక కార్యకలాపాలలో సృష్టంగా ప్రతిబింబిస్తుంది.గాంధీజీ సూత్రాలను అనుసరించే ఆమె, జీవితంలో చాలా ముందుగానే అతని తెలివిగల మాటలకు కట్టుబడి ఉంటానని, ప్రపంచంలో మార్పును కోరుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. ‘గాంధీ బాన్ జౌ’ (నేను గాంధీ అవ్వాలనుకుంటున్నాను) అనే ఆమె చెప్పుకోదగిన పుస్తకంలో అతని పట్ల ఆమెకు ఉన్న గౌరవం కూడా కనిపిస్తుంది.[2]
1930 శాసనోల్లంఘన ఉద్యమంలో కమలా చౌదరి భారత జాతీయ కాంగ్రెసులో చేరింది.అప్పటి నుండి ఆమె భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. బ్రిటిష్ అధికారులు పలుసార్లు ఆమెను జైలులో నిర్బందించారు.భారత జాతీయ కాంగ్రెసు కమిటీ 54 వ సభలో ఆమె డిప్యూటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించింది.ఆమె భారత రాజ్యాంగ పరిషత్ కు సభ్యురాలుగా పనిచేసింది.రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఆమె 1952 వరకు భారత ప్రభుత్వ ప్రావిన్షియల్ సభ్యురాలిగా పనిచేసింది.ఆమె ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ సలహా మండలి సభ్యురాలుగా వ్యవహరించింది.[2]1962లో 3 వ లోకసభకు జరిగిన భారతదేశ సాధారణ ఎన్నికల్లో చౌదరి భారత జాతీయ కాంగ్రెసు అధికారిక అభ్యర్థిగా హపూర్ నుండి ఆమె తన సమీప ప్రత్యర్థి నసీమ్ ను 28,633 ఓట్ల తేడాతో ఓడించింది.[2]
హిందీ సాహిత్యం పట్ల తన ప్రేమను ముందుకు తీసుకెళ్లిన కమలా చౌదరి మహిళలు, వారి అంతర్గత ప్రపంచం చుట్టూ తిరిగే కథలను రాయడం ప్రారంభించింది. ఆమె ఇతివృత్తాలు విలక్షణంగా స్త్రీవాదమైనవి, పదునైనవి, ధైర్యంగా పరిగణించబడ్డాయి. ఆ కాలంలో భారతీయ సమాజంలో ఒక మహిళ ఎదుర్కొన్న మానసిక గాయాలను, అవి సమాజంలోని వివిధ విభాగాలలో ప్రబలంగా ఉన్న సాంప్రదాయిక సంస్కృతిని స్పష్టంగా గుర్తుచేసి, ఆడపిల్లలని ఎంతో తీవ్రంగా ప్రభావితం చేసింది.లింగ వివక్ష, వైధవ్యం, స్త్రీ కోరికలు, కార్మికుల దోపిడీ, నిరంతరం అణచివేత కారణంగా మహిళల మానసిక ఆరోగ్యంపై హాస్యం పద్యాల వరకు, ఆమె రచనలు విశేషమైన ప్రయాణాన్ని కలిగి ఉన్నాయి.స్వాతంత్య్రానంతరం, చారిత్రక, సాంస్కృతిక అంశాలను అన్వేషించి,ఆధునిక దేశంగా భారతదేశ ఆవిర్భావం గురించి ఆమె కథలు రాసింది.ఆమె కథల నాలుగు సేకరణలు ప్రచురించబడ్డాయి.అవి ఉన్మాద్ (1934), పిక్నిక్ (1936), యాత్ర (1947), బెల్ పాత్రా. లింగవివక్ష, రైతులపై దోపిడీ, వితంతువుల పేలవస్థితి ఆమె రచనలలో ప్రధాన ఇతివృత్తాలు.[2]
ఆమె ఫిబ్రవరి 1922లో జెఎం చౌదరిని వివాహం చేసుకుంది. ఆమె మామ స్వరాజ్య పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు.ఆమెకు రచయిత, సంపాదకులు డాక్టర్ ఇరాసక్సేనా, దివంగత మాధవేంద్ర మోహన్,డాక్టర్ హేమేంద్ర మోహన్ చౌదరితో సహా మరికొంత మంది పిల్లలు ఉన్నారు.