కమలానగర్ | |
---|---|
Coordinates: 17°28′23″N 78°33′59″E / 17.47306°N 78.56639°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా |
Government | |
• Body | కాప్రా |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 062 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | కాప్రా |
పట్టణ అభివృద్ధి సంస్థ | కాప్రా |
కమలానగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం.[1] ఇది ఇసిఐఎల్, ఎన్.ఎఫ్.సిలకు సమీపంలో ఉంది.
ఇసిఐఎల్, ఎన్.ఎఫ్.సిలలో పనిచేసేవారు ఇక్కడ స్థిరపడడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది.
కుషాయిగుడ పారిశ్రామిక ప్రాంతం, అనుపురం, ఎ.ఎస్. రావు నగర్, డిఎఇ కాలనీ, హెచ్‌సిఎల్ కాలనీ, ఘటకేసర్, మౌలాలీ మొదలైనవి కమలానగర్‌కు సమీపంలో ఉన్నాయి.[2]
ఇక్కడికి సమీపంలో సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ఉంది. నగర రైళ్ళకోసం మౌలాలీ, రామకృష్ణపురం ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కమలానగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడికి సమీపంలోని కుషాయిగుడలో బస్ డిపో ఉంది.
కమలానగర్, దాని పరిసరాల్లో నివాసముంటున్న మలయాళీలకోసం అయ్యప దేవాలయం నిర్మించబడింది. ఇక్కడ ఇసిఐఎల్ బస్ స్టేషను, పోలీస్ స్టేషన్[3] ఉన్నాయి.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)