వ్యక్తిగత సమాచారము | ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తిపేరు | కమల్జీత్ కౌర్ సంధు | |||||||||||||
జాతీయత | భారతీయులు | |||||||||||||
జననం | 20 ఆగస్టు 1948[1] ఫిరోజ్‌పూర్, పంజాబ్, భారతదేశం | |||||||||||||
క్రీడ | ||||||||||||||
దేశం | భారతదేశం | |||||||||||||
క్రీడ | అథ్లెటిక్స్ | |||||||||||||
విజయాలు, బిరుదులు | ||||||||||||||
వ్యక్తిగత ఉత్తమ విజయాలు | 55.6 (1972) | |||||||||||||
మెడల్ రికార్డు
|
కమల్జీత్ కౌర్ కూనేర్ నీ సంధు (జననం 1948 ఆగస్టు 20) 1970 లో జరిగిన బ్యాంకాక్ ఆసియా క్రీడలలో 400 మీటర్ల రేసులో బంగారు పతకం సాధించిన భారతీయ మహిళా అథ్లెట్. ఆమె 57.3 సెకన్లలో ఈ ఘనతను సాధించింది. ఆసియా క్రీడలలో వ్యక్తిగత బంగారు పతకం సాధించిన మొదటి భారతీయ మహిళా అథ్లెట్ ఆమె.[3] ఆమె భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందినది. ఆమె 1971లో పద్మశ్రీ అవార్డును అందుకుంది.[3] 1971లో ఇటలీలోని టురిన్లో జరిగిన వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ లో 400 మీటర్ల రేసులో ఫైనలిస్టులలో ఆమె ఒకతె. ఆమె 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ మహిళల 400 మీటర్లలో పాల్గొని, హీట్స్ లో ఓడిపోయింది. కమల్జీత్ 1973లో అథ్లెటిక్స్ నుండి విరమించింది. ఆమె జాతీయ స్థాయి బాస్కెట్ బాల్, ఇంటర్-వర్సిటీ హాకీ క్రీడాకారిణి కూడా. ఆమె 1982 ఆసియా క్రీడలకు భారత మహిళల స్ప్రింట్ జట్టుకు కోచ్ గా వెళ్ళింది. ఆమె సింధియా కన్యా విద్యాలయ పూర్వ విద్యార్ధి కూడా. .[4]