కమ్తాపూర్ పీపుల్స్ పార్టీ | |
---|---|
Chairperson | అతుల్ రాయ్ |
సెక్రటరీ జనరల్ | నిఖిల్ రాయ్ |
స్థాపన తేదీ | 1996 జనవరి |
ప్రధాన కార్యాలయం | సిలిగురి, డార్జిలింగ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ |
విద్యార్థి విభాగం | ఆల్ కోచ్ రాజ్‌బోంగ్షి స్టూడెంట్స్ యూనియన్ |
రాజకీయ విధానం | కమ్తాపూర్ రాష్ట్ర ఏర్పాటు |
కూటమి | ఎన్.డి.ఎ. |
కమ్తాపూర్ పీపుల్స్ పార్టీ అనేది పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర ప్రాంతాలలో పనిచేస్తున్న రాజకీయ పార్టీ. 1996 జనవరిలో అతుల్ రాయ్ ఈ పార్టీని స్థాపించాడు. కమ్తాపూర్ పీపుల్స్ పార్టీ రాజబన్షి జనాభాలో పనిచేస్తుంది. ప్రత్యేక కమ్తాపూర్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, రాజ్‌బన్షి/రాజ్‌బాంగ్షి/కామతాపురి మాండలికాన్ని ప్రత్యేక భాషగా గుర్తించాలని కమ్తాపూర్ పీపుల్స్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
కమ్తాపూర్ పీపుల్స్ పార్టీ విద్యార్థి విభాగం ఆల్ కమ్తాపూర్ స్టూడెంట్స్ యూనియన్. మహిళా విభాగం పేరు కమ్తాపూర్ ఉమెన్స్ రైట్స్ ఫోరం.
2001 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, కమ్తాపూర్ పీపుల్స్ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని బంగ్లా బచావో ఫ్రంట్‌లో చేరింది.
2003 వసంతకాలంలో, కమ్తాపూర్ పీపుల్స్ పార్టీ అంతర్గత విభజనను ఎదుర్కొంది. అతుల్ రాయ్ మితవాదిగా పరిగణించబడ్డాడు, అతని స్థానంలో మరింత కఠినమైన నాయకత్వం వచ్చింది. నిఖిల్ రాయ్ కమ్తాపూర్ పీపుల్స్ పార్టీ కొత్త అధ్యక్షుడయ్యాడు, ప్రధాన కార్యదర్శి సుభాస్ బర్మన్ నియమించబడ్డాడు. అతుల్ రాయ్ కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు.
2004 లోక్‌సభ ఎన్నికలకు ముందు, కమ్తాపూర్ పీపుల్స్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చాతో కలిసి ఫ్రంట్‌ను ఏర్పాటు చేసింది.
2006లో, అతుల్ రాయ్ కమ్తాపూర్ పీపుల్స్ పార్టీ నుండి విడిపోయి కమ్తాపూర్ ప్రోగ్రెసివ్ పార్టీ అనే కొత్త పార్టీని స్థాపించాడు. అయితే అతుల్ రాయ్, నిఖిల్ రాయ్ 2010 అక్టోబరులో తమ వివాదాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. అతుల్ తన పార్టీని కమ్తాపూర్ పీపుల్స్ పార్టీలో విలీనం చేశాడు.[1] నేడు కంతాపూర్ పీపుల్స్ పార్టీ ఒక్కటే ఉంది. పార్టీ అధ్యక్షుడిగా అతుల్ రాయ్, ప్రధాన కార్యదర్శిగా నిఖిల్ రాయ్ ఉన్నారు.