కరియా ముండా | |||
| |||
పదవీ కాలం 8 జూన్ 2009 – 18 మే 2014 | |||
ముందు | చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ | ||
---|---|---|---|
తరువాత | ఎం. తంబిదురై | ||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | సుశీల కెర్కెట్టా | ||
తరువాత | అర్జున్ ముండా | ||
నియోజకవర్గం | ఖుంటి | ||
పదవీ కాలం 1989 – 2004 | |||
ముందు | సైమన్ టిగ్గా | ||
తరువాత | సుశీల కెర్కెట్టా | ||
నియోజకవర్గం | ఖుంటి | ||
పదవీ కాలం 1977 – 1980 | |||
ముందు | నిరల్ ఎనెమ్ హోరో | ||
తరువాత | నిరల్ ఎనెమ్ హోరో | ||
నియోజకవర్గం | ఖుంటి | ||
జార్ఖండ్ శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2005 – 2009 | |||
ముందు | నియోజకవర్గం సృష్టించారు | ||
తరువాత | సావన్ లక్రా | ||
నియోజకవర్గం | ఖిజ్రీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అనిగరా, బీహార్, (ప్రస్తుత జార్ఖండ్), బ్రిటిష్ ఇండియా | 1936 ఏప్రిల్ 20||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సునందా దేవి (m. 1967) | ||
సంతానం | 2 కుమారులు, 3 కుమార్తెలు | ||
నివాసం | అనిగర గ్రామం, ఖుంటి జిల్లా , జార్ఖండ్ | ||
పూర్వ విద్యార్థి | రాంచీ విశ్వవిద్యాలయం | ||
సంతకం | |||
పురస్కారాలు | పద్మభూషణ్ 2019 | ||
మూలం | http://loksabhaph.nic.in/Members/MemberBioprofile.aspx?mpsno=259&lastls=16 |
కరియా ముండా (జననం 20 ఏప్రిల్ 1936) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిది సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికై, 15వ లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌గా, భారత ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1]
ఆయన 2019లో దేశ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నాడు.
కరియా ముండా 1936 ఏప్రిల్ 20న జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా అనిగరా గ్రామంలో జన్మించాడు. ఆయన రాంచీ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు.
కరియా ముండా 1977లో భారతీయ లోక్ దళ్ నుండి ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 1989, 1991, 1996, 1998, 1999, 2009, 2014లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికై 8 జూన్ 2009 నుండి 18 మే 2014 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.
కరియా ముండా 14 ఆగస్టు 1977 నుండి 28 జూలై 1979 వరకు మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో కేంద్ర ఉక్కు & గనుల శాఖ సహాయ మంత్రిగా, అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో 1 సెప్టెంబర్ 2001 నుండి 29 జనవరి 2004 వరకు వ్యవసాయ & గ్రామీణ పరిశ్రమల మంత్రిగా, 29 జనవరి 2003 నుండి 9 జనవరి 2004 వరకు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా, 9 జనవరి 2004 నుండి 22 మే 2004 ఇంధన వనరుల మంత్రిగా పని చేశాడు. ఆయన బీహార్, జార్ఖండ్ శాసనసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. ఆయన 21 సెప్టెంబర్ 2022న పిఎం కేర్స్ ఫండ్ ట్రస్టీగా నామినేట్ అయ్యాడు.[2]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)