కర్పూరీ ఠాకూర్ | |
---|---|
![]() 1991 భారతదేశ పోష్టల్ స్టాంపుపై కర్పూరీ ఠాకూర్ | |
11వ బీహార్ ముఖ్యమంత్రి | |
In office 1970 డిసెంబరు 22 – 1971 జూన్ 2 | |
అంతకు ముందు వారు | దరోగ ప్రసాద్ రాయ్ |
తరువాత వారు | భోలా పాశ్వాన్ శాస్త్రి |
In office 1977 జూన్ 24 – 1979 ఏప్రిల్ 21 | |
అంతకు ముందు వారు | జగన్నాథ్ మిశ్రా |
తరువాత వారు | రామ్ సుందర్ దాస్ |
2వ బీహార్ ఉపముఖ్యమంత్రి | |
In office 1967 మార్చి 5 – 1968 జనవరి 31 | |
ముఖ్యమంత్రి | మహామాయా ప్రసాద్ సిన్హా |
అంతకు ముందు వారు | అనుగ్రహ నారాయణ్ సిన్హా |
తరువాత వారు | సుశీల్ కుమార్ మోడీ |
బీహార్ విద్యా మంత్రి | |
In office 1967 మార్చి 5 – 1968 జనవరి 31 | |
అంతకు ముందు వారు | సత్యేంద్ర నారాయణ్ సిన్హా |
తరువాత వారు | సతీష్ ప్రసాద్ సింగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | పితౌంజియా, బీహార్, ఒరిస్సా ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా | 1924 జనవరి 24
మరణం | 17 ఫిబ్రవరి 1988 పాట్నా, బీహార్, భారతదేశం | (aged 64)
రాజకీయ పార్టీ | సోషలిస్ట్ పార్టీ (ఇండియా), భారతీయ క్రాంతి దళ్, జనతా పార్టీ, లోక్ దళ్ |
సంతానం | రామ్ నాథ్ ఠాకూర్ |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, ఉపాధ్యాయుడు, రాజకీయ నాయకుడు |
పురస్కారాలు | ![]() |
కర్పూరీ ఠాకూర్ (1924 జనవరి 24 - 1988 ఫిబ్రవరి 17) బీహార్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, మొదట 1970 డిసెంబరు నుండి 1971 జూన్ వరకు, ఆపై 1977 జూన్ నుండి 1979 ఏప్రిల్ వరకు అతను ఆ పదవిలో కొనసాగాడు.
అతనికి కేంద్రప్రభుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ 2024 జనవరి 23న ఒక ప్రకటన విడుదల చేసింది.[1]
కర్పూరీ ఠాకూర్ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా పితౌంజియా (ప్రస్తుతం కర్పూరి) గ్రామంలో గోకుల్ ఠాకూర్, రామ్‌దులారి దేవి దంపతులకు జన్మించాడు.[2][3][4] అతను మహాత్మా గాంధీ, సత్యనారాయణ సిన్హాచే ప్రభావితమయ్యాడు.[5][6] అతను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చేరి విద్యార్థి నాయకుడిగా[7], క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు, అతను 26 నెలల జైలు జీవితం గడిపాడు.[8]
భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, తన గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు. అతను 1952లో తాజ్‌పూర్ నియోజకవర్గం నుండి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా బీహార్ విధానసభ సభ్యుడు అయ్యాడు. 1960లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సార్వత్రిక సమ్మె సందర్భంగా పి అండ్ టి ఉద్యోగులకు నాయకత్వం వహించినందుకు అరెస్టయ్యాడు. 1970లో, అతను టెల్కో కార్మికుల ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి 28 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాడు.[8]
హిందీ భాషపై తనకున్న విశ్వాసంతో బీహార్ విద్యా మంత్రిగా మెట్రిక్యులేషన్ పాఠ్యాంశాలకు ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్ట్‌గా తొలగించాడు. అతను 1970లో బీహార్‌లో మొదటి కాంగ్రెసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి ముందు బీహార్‌లో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అతను బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా అమలు చేశాడు. అతని హయాంలో, బీహార్‌లోని వెనుకబడిన ప్రాంతాలలో అతని పేరు మీద అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి.
అతను సంయుక్త సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసాడు. లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి ప్రముఖ బీహారీ నాయకులకు అతను గురువుగా కీర్తిపొందాడు.[9]
1984లో ప్రారంభించబడిన దళిత మజ్దూర్ కిసాన్ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నాడు.
కర్పూరీ ఠాకూర్ 1952లో ఎమ్మెల్యేగా ఎన్నికతో ప్రారంభమైన రాజకీయ జీవితం (1977 పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనప్పుడు, 1984 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సమయం మినహా) 1988లో మరణించే వరకు శాసనసభ్యునిగా ఉన్నాడు. ఠాకూర్ 1967 మార్చి 5 నుంచి 1968 జనవరి 28 వరకు బీహార్ విద్యాశాఖ మంత్రిగా,1970 డిసెంబరులో సంయుక్త సోషలిస్టు పార్టీతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు, కాని అతని ప్రభుత్వం ఆరు నెలల తరువాత పడిపోయింది. 1977 జూన్ లో తిరిగి పదవిని చేపట్టినా పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేయలేక, దాదాపు రెండేళ్లలో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇందుకు ప్రధానకారణం అతను అమలు చేసిన రిజర్వేషన్ విధానం వల్ల జరిగిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటారు. కర్పూరీ ఠాకూర్ విధానపరమైన నిర్ణయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, అతని సచ్చీలత (క్లిన్ ఇమేజ్), మచ్చలేని రాజకీయ నాయకుడిగా వ్యక్తిగతంగా గౌరవించబడ్డారు.[10]
కర్పూరి ఠాకూర్ 64 సంవత్సరాల వయసులో 1988 ఫిబ్రవరి 17న గుండెపోటుతో మరణించాడు.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
Karpoori Thakur, a Gandhian leader from an extremely backward caste of a barber or nai community from Samastipur