దస్త్రం:CESC Logo.svg | |
రకం | పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ |
---|---|
NSE: CESC బి.ఎస్.ఇ: 500084 | |
పరిశ్రమ | ఎలక్ట్రిక్ యుటిలిటీ |
స్థాపన | కోల్‌కతా, భారతదేశం |
స్థాపకుడు | ఆర్.పి. గోయెంకా |
ప్రధాన కార్యాలయం | కోల్‌కతా, భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | పశ్చిమ బెంగాల్, భారతదేశం |
కీలక వ్యక్తులు | సంజీవ్ గోయెంకా (చైర్మన్) రబీ చౌదరి (మేనేజింగ్ డైరెక్టర్ - ఉత్పత్తి ) దేబాశిష్ బెనర్జీ (మేనేజింగ్ డైరెక్టర్ - పంపిణీ) రాజర్షి బెనర్జీ (ఆర్ధిక నిర్వహణ)[1] |
ఉత్పత్తులు | విద్యుత్ శక్తి |
సేవలు | విద్యుత్ ఉత్పత్తి , పంపిణీ సహజ వాయువు(నేచురల్ గ్యాస్) ఎక్స్‌ప్లోరేషన్, ప్రొడక్షన్, రవాణా, పంపిణీ |
రెవెన్యూ | ![]() |
![]() | |
Total assets | ![]() |
Total equity | ![]() |
ఉద్యోగుల సంఖ్య | 7,886 (2020) |
మాతృ సంస్థ | ఆర్ పి ఎస్ జి గ్రూప్ |
వెబ్సైట్ | cesc![]() |
కలకత్తా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ (సిఈఎస్‌సి) ( Calcutta Electric Supply Corporation (CESC Ltd) కోల్ కతాకు చెందిన ఆర్ పి-సంజీవ్ గోయెంకా గ్రూప్ లోని ఫ్లాగ్ షిప్ కంపెనీ. కోల్ కతా నగరపాలక సంస్థచే నిర్వహించబడుతున్న కోల్ కతా, హౌరాకు 567 చదరపు కిలోమీటర్ల పరిధిలో విద్యుత్ ఏకైక పంపిణీదారుగా విద్యుత్ సేవలను అందిస్తున్న పంపిణీ సంస్థ. ఈ సంస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గృహ, వాణిజ్య,పారిశ్రామిక వినియోగదారులతో సహా సుమారు 2.9 మిలియన్ల మందికి తన సేవలందిస్తుంది. ఈ కంపెనీకి 1125 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే మూడు థర్మల్ పవర్ ప్లాంట్లతో నిర్వహిస్తున్నాము. వీటిలో బడ్జ్ బడ్జ్ జనరేటింగ్ స్టేషన్ (750 మెగావాట్లు), సదరన్ జనరేటింగ్ స్టేషన్ (135 మెగావాట్లు), టిటాఘర్ జనరేటింగ్ స్టేషన్ (240 మెగావాట్లు) ఉన్నాయి. ఈ మూడు ఉత్పాదక కేంద్రాల నుండి, వినియోగ విద్యుత్ అవసరాలలో 88% అవుతున్నది. ఈ సంస్థ ఉత్పాదక కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం 50 శాతానికి పైగా బొగ్గును క్యాప్టివ్ గనుల నుంచి సేకరిస్తున్నారు.[3]
కలకత్తా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ (సి.ఇ.ఎస్.సి) దక్షిణాసియాలో మొట్టమొదటి వాణిజ్య విద్యుత్ సరఫరా సంస్థను స్థాపించింది. సిఈఎస్ సి 1899 ఏప్రిల్ 17 న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా (ప్రస్తుతం కోల్ కతా) లోని ఎమాంబాగ్ లేన్, ప్రిన్సెప్ స్ట్రీట్ వద్ద 1000 కిలోవాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించి వీధి దీపాలు, గృహ, కార్యాలయ భవనాలు, కలకత్తా ట్రామ్ వేస్ కోసం 450/225V DC శక్తిని అందించింది.
కలకత్తా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్( సి.ఇ.ఎస్.సి) 1897 సంవత్సరం నుండి కలకత్తా నగరంలో విద్యుత్తు పంపిణీని ప్రారంభించింది, ఆ సమయంలో భారతదేశానికి కోల్ కతా బ్రిటిష్ రాజధానిగా ఉంది. విద్యుత్తు రావడంతో కోల్ కతా పట్టణం,పరిసర ప్రాంతాలలో వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణకు ప్రారంభం అయినది. కలకత్తా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ 1899 ఏప్రిల్ 17 న కలకత్తాలోని ప్రిన్సెప్ స్ట్రీట్ సమీపంలోని ఎమాంబాగ్ లేన్ వద్ద మొదటి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించింది. ప్రాథమిక సామర్థ్యం 3 x 500 HP, డైరెక్ట్ కరెంట్ (DC) 450 & 225 వోల్టుల వద్ద వినియోగదారులకు సరఫరా చేయబడింది.
సి.ఇ.ఎస్.సి తరువాత 1902 మార్చిలో అలీపోర్ వద్ద 750 కిలోవాట్ల సామర్థ్యంతో, 1906 మేలో 165 కిలోవాట్ల సామర్థ్యం గల ఉల్టాడంగా,1906 సెప్టెంబరులో హౌరాలో 1200 కిలోవాట్ల సామర్థ్యంతో అదనపు విద్యుత్ కేంద్రాలను స్థాపించింది. 1912లో 15 మెగావాట్ల సామర్థ్యంతో కాస్సిపోర్ జనరేటింగ్ స్టేషన్ ను ప్రారంభించారు, ఇది మునుపటి నాలుగు ఉత్పాదక స్టేషన్ల స్థానంలో ఉంది. CESC 1920లో ఆల్టర్నేటింగ్ కరెంట్ (AC)కు మారింది. వీధి దీపాలు, హై-ఎండ్ డొమెస్టిక్ లోడ్, కలకత్తా ట్రామ్ వేస్ విద్యుదీకరణ కోసం ఉపయోగం అయినది.[4]
సిఈఎస్ సి సంస్థ పూర్తిగా ఇంటిగ్రేటెడ్ పవర్ యుటిలిటీ, మొత్తం వాల్యూ ఛైయిన్ ని విస్తరించే కార్యకలాపాలతో కంపెనీ వినియోగదారులకు సేవలను అందిస్తుంది. అవి బొగ్గు గనుల తవ్వకం, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వరకు. ప్రస్తుతం సుమారు 3.3 మిలియన్లకు కోల్ కతా,హౌరా లోని వినియోగదారులకు సేవలందిస్తుంది. సంస్థకు కోల్ కతాలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్ లను కలిగి ఉంది - బడ్జ్ బడ్జ్ (750 MW), సదరన్ (135 MW), టిటాగఢ్ (240 మెగావాట్లు), హల్దియాలో ఒకటి (600 మెగావాట్లు). కంపెనీ పురోగతిలో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల ద్వారా పునరుత్పాదక శక్తిలోకి కంపెనీ ప్రవేశించింది అవి గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్నాయి.[5]
1978లో కలకత్తా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ (ఇండియా)గా ఏర్పాటు చేయబడిన సిఈఎస్ సి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి,పంపిణీలో నిమగ్నమై ఉంది.
1983లో కంపెనీ 240 మెగావాట్ల సామర్థ్యంతో టిటాఘర్ ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభించింది, కలకత్తా (ప్రస్తుతం కోల్ కతాగా పిలువబడుతోంది) లో ఈ ప్లాంట్ విద్యుత్ కొరతను పాక్షికంగా అక్కడ పరిష్కరించింది.
ఆర్ పి జి గ్రూపులో భాగంగా 1987 జనవరి 1న కంపెనీ పేరును సి.ఇ.ఎస్.సిగా మార్చారు. ఈ సంస్థ 135 మెగావాట్ల సదరన్ జనరేషన్ స్టేషన్ ను ఏర్పాటు చేసి 1990 సెప్టెంబరు నుండి సరఫరాను ప్రారంభించింది. రెండవ యూనిట్ 1991 మే సంవత్సరంలో సరఫరాను ప్రారంభించింది.
సంస్థ రియల్ ఎస్టేట్ కింద వ్యాపారాన్ని నడుపుతున్న సిఈఎస్‌సి ప్రాపర్టీస్, స్పెన్సర్స్ రిటైల్ (ఎస్ఆర్ఎల్) అనే రెండు అనుబంధ సంస్థలను (సబ్సిడరీలను) కలిగి ఉంది. 100 సంవత్సరాలకు పైగా వ్యాపారంలో ఉంది. భారత ఉపఖండంలో మొట్టమొదటి పవర్ కంపెనీగా ఉన్నది . 2010-11లో సి ఇ ఎస్ సి లిమిటెడ్ రెండు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది, అవి బంటాల్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, సి ఇ ఎస్ సి ప్రాజెక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్.
ప్రస్తుతమున్న సామర్థ్యాలకు 500 మెగావాట్లను జోడించాలని సిఈఎస్ సి నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం మనీలా లోని ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్, వాషింగ్టన్ లో ఐ ఎఫ్ సి (IFC) వంటి అంతర్జాతీయ రుణ సంస్థల నుండి సంస్థ ఆర్థిక సహాయం తీసుకుంది.[6]
కలకత్తా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ పొందిన అవార్డులు.[6]