కలియుగ రాముడు (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బాపయ్య |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, రతి అగ్నిహోత్రి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | తిరుపతి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కలియుగ రాముడు 1982లో విడుదలైన తెలుగు సినిమా. తిరుపతి ప్రొడక్షన్స్ పతాకంపై డి.శ్రీరంగరాజు నిర్మించిన ఈ సినిమాకు కె.బాపయ్య దర్శకత్వం వహించాడు. నందమూరి తారక రామారావు, రతి అగ్నిహోత్రి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
ఒక జమీందారుకు లేక లేక మగబిడ్డ పుడతాడు. అతని ఎడమ అరచేతిలో అద్భుతమైన శక్తులు కలిగిన రేఖ ఉంటుంది. అతను మహరాజు కావడమో, గజదొంగ కావడమో జరుగుతుందని జ్యోతిష్యుడు చెయుతాడు. చినబాబు రాం పేరుతో పెరిగి పెద్దవాడవుతాడు. ఒక నాడు రైలు లో రాం కట్టెదుటే కొందరు దుండగులు పీటర్ అనే వృద్ధుడుని హత్య చేస్తారు. పీటర్ కళ్ళు మూస్తూ " ట్రంపెట్ నోట్స్" వినిపించే సిగార్ లైటర్ ను రామ్ కు ఇస్తాడు. రాం నిజానికి ప్రభుత్వ గూఢచారి. పెట్రోలుకు ప్రత్యామ్నాయ ఇంథనాన్ని కనుగొన్న శాస్త్రీజీ అనే ప్రముఖ శాస్త్రవేత్తను దుండగులు అపహరిస్తారు. ఆ శాస్త్రవేత్త ఆచూకీ తెలియాలంటే సిగార్ లైటర్ సంగీతాన్ని అర్థం చేసుకోవాలి. దుండగులు రాం ను వెంటాడుతారు. రైలులో కలిసి ప్రయాణం చేస్తున్న రామ్‌ను సంథ్య అనే అందమైన యువతి ని దుండగులు పట్టుకొని తీసుకుపోతుండగా రామ్ సంథ్యతో సహా తప్పించుకుంటాడు. రామ్ దుండగులను ఎలా పట్టుకున్నాడనేది మిగిలిన కథ.[2]