కల్యాణి మాలిక్ | |
---|---|
జననం | కల్యాణ్ కోడూరి |
వృత్తి | సంగీత దర్శకుడు, గాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఉమ |
తల్లిదండ్రులు |
|
కల్యాణి మాలిక్ సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు. అతడి అసలు పేరు కోడూరి కళ్యాణ్. అతడు సినిమా కుటుంబానికి చెందినవాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి సోదరుడు.[1] రచయిత విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి, సంగీత దర్శకురాలు ఎం. ఎం. శ్రీలేఖ కళ్యాణి మాలిక్‌కు చుట్టాలే. బృంద గాయకుడిగా, ముఖ్య గాయకుడిగా, సహాయ సంగీత దర్శకుడిగా, టీవీ సీరియళ్ళు వ్యాపార ప్రకటనలకు సంగీతాన్నిచ్చి, సినిమా సంగీత దర్శకుడయ్యాడు. [2] ఐతే సినిమాతో కళ్యాణి మాలిక్ సినిమా రంగ ప్రవేశం చేసాడు.
సోదరుడు కీరవాణి వద్ద బృంద గాయకుల్లో ఒకడిగా కళ్యాణి మాలిక్ సంగీత ప్రస్థానం మొదలైంది. [3]యువరత్న సినిమాలో సన్నజాజి పూవా పాటతో అతడు పూర్తిస్థాయి గాయకుడయ్యాడు. ఓవైపు పాటలు పాడుతూనే కీరవాణికి సంగీత దర్శకత్వ సహాయకుడుగా పనిచేసాడు. అనేక టీవీ సీరియళ్ళకు, వ్యాపార ప్రకటనలకూ అతడు పనిచేసాడు. ఆ తరువాత ఐతే సినిమాతో సంగీత దర్శకుడయ్యాడు. దాని తోటి అతడికి మంచి పేరొచ్చింది. ఆ తరువాత అష్టా చెమ్మా, అలా మొదలైంది, గోల్కొండ హైస్కూల్. ఊహలు గుసగుసలాడే వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.[4]