కళ్యాణ వైద్యనాథన్ కుత్తూరు సుందరం | |
---|---|
2 వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరు | |
In office 1958 డిసెంబరు 20 – 1967 సెప్టెంబరు 30 | |
అంతకు ముందు వారు | సుకుమార్ సేన్ |
తరువాత వారు | ఎస్.పి.సేన్ వర్మ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Kuttur[ta], Madras Presidency | 1904 మే 11
మరణం | 1992 సెప్టెంబరు 23 ఢిల్లీ | (వయసు 88)
జాతీయత | భారతీయుడు |
జీవిత భాగస్వామి | ఇందిర సుందరం |
సంతానం | వివాన్ సుందరం |
పురస్కారాలు | పద్మ విభూషణ (1968) |
కళ్యాణ్ వైద్యనాథన్ కుత్తూరు సుందరం (1904 మే 11 - 1992 సెప్టెంబర్ 23), భారతీయ ప్రభుత్వ అధికారి, స్వతంత్ర భారతదేశపు మొట్ట మొదటి న్యాయ కార్యదర్శి (1948-58). అతను 1958 డిసెంబర్3ఉ 20 1967 సెప్టెంబరు 30 మధ్య, భారతదేశపు రెండవ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసాడు.. అతను KVK సుందరం గా ప్రసిద్ధుడు. 1968-71 మధ్య ఐదవ లా కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షత వహించాడు.[1][2]
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గనిర్దేశం చేసేందుకు ఉపయోగించే శ్వేతపత్రాన్ని అతను తయారుచేసాడు. దీని కోసం, అతను లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ నుండి వ్యక్తిగత కృతజ్ఞతలు, ప్రశంసలూ అందుకున్నాడు. అతను సంస్కృత పండితుడు కూడా.
సంస్కృత రచయిత కాళిదాసు రచనలను ఇంగ్లీషు లోకి అనువదించాడు. [1] ది ఇండిపెండెంట్ అతన్ని వినయం, విచక్షణ కలిగిన వ్యక్తి అని వర్ణించింది. సుందరం 1968 లో భారత ప్రభుత్వపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నాడు.[1][3]
సుందరం స్వస్థలం అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న కుత్తూరు గ్రామం. [1] అతను 1904లో ఒక ప్రొఫెసర్‌కి జన్మించాడు. ప్రెసిడెన్సీ కాలేజ్, క్రైస్ట్ చర్చ్, ఆక్స్‌ఫర్డ్ పూర్వ విద్యార్థి, అతను 1925లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ICS) శిక్షణ కోసం నమోదు చేసుకున్నాడు. 1934 లో అతని మొదటి భార్య లక్ష్మి మరణించింది. ఆ తరువాత, అతను కళాకారిణి అమృతా షెర్గిల్ సోదరి ఇందిరా షెర్గిల్‌ను పెళ్ళి చేసుకున్నాడు. వారికి వివాన్ అనే కుమారుడు ఉన్నాడు. అతనూ కళాకారుడే,
సుందరం 1927లో సెంట్రల్ ప్రావిన్స్‌లో తన ICS కెరీర్‌ను ప్రారంభించాడు. మొదట్లో జిల్లాలలో పనిచేసి, 1931 లో నాగ్‌పూర్‌లో సంస్కరణల అధికారిగా ప్రాంతీయ స్థాయికి ఎదిగాడు.[1] అక్కడ, అతను ప్రదర్శించిన చట్టపరమైన చతురతను చూసిన జ్యుడీషియల్ కమీషనర్ సర్ రాబర్ట్ మెక్‌నైర్ మెచ్చుకున్నాడు.
1935లో, భారత ప్రభుత్వ చట్టం అమలు చేసారు. ఇది భారత ప్రావిన్సులలో ఎన్నికైన శాసనసభను ఏర్పాటు చేయడానికి దారితీసింది. ఈ చట్టం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చే దిశలో మొదటి అడుగు. అందులో సుందరం చురుకైన పాత్ర పోషించాడు.[4] బ్రిటీష్ వారి నియంత్రణలో లేని వందలాది సంస్థానాల సరిహద్దులను దృష్టిలో ఉంచుకుని, భారతదేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించాలని బ్రిటీష్ బ్యూరోక్రసీ కోరుకుంది. వారు 1936 లో ఈ పత్రాన్ని సిద్ధం చేసేందుకు సుందరంను నియమించారు.[1][5] ఈ శ్వేతపత్రం భారతదేశాన్ని రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించడానికి పునాదిగా మారింది; పటేల్, VP మీనన్ లు భారత యూనియన్‌తో కలిసిపోవడానికి సంస్థానాధీశులను ఒప్పించేందుకు కూడా దీనిని ఉపయోగించారు. 1948లో లా సెక్రటరీ పదవికి ఎదిగిన తర్వాత సుందరం స్వయంగా ఈ పనిని చాలా వరకు పర్యవేక్షించగలిగాడు, ఇతర అర్హతగల సీనియరు అభ్యర్థులు ఉన్నప్పటికీ సర్ జార్జ్ స్పెన్స్, సుందరంను ఈ పదవి కోసం ప్రత్యేకంగా అభ్యర్థించాడు.[1][6]
1958 లో, లా సెక్రటరీగా పదవీకాలం ముగిసిన తర్వాత సుందరం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ బాధ్యతలు చేపట్టిన రెండవ వ్యక్తి అతడు.[1] 1967లో, 1968లో ఆ పదవిని విడిచిపెట్టి, లా కమిషన్ ఛైర్మన్ అయ్యాడు. అదే సంవత్సరం పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నాడు. 1971 లో ఆ పదవిని కూడా విడిచిపెట్టిన తర్వాత, అతను మళ్లీ సరిహద్దు సమస్యలలోకి ప్రవేశించాడు. హోం మంత్రిత్వ శాఖకు సలహాదారుగా అస్సాం, నాగాలాండ్ రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంలో సహాయం చేశాడు.
<ref>
ట్యాగు; "The Independent" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
{{cite book}}
: |work=
ignored (help)