కళ్యాణ్ రామ్ కత్తి | |
---|---|
దర్శకత్వం | మల్లికార్జున్ |
రచన | వక్కంతం వంశీ, ఎం.రత్నం |
నిర్మాత | నందమూరి కళ్యాణ్ రామ్ |
తారాగణం | నందమూరి కళ్యాణ్ రామ్, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్ బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | సర్వేశ్ మురారి |
కూర్పు | గౌతం రాజు |
సంగీతం | మణిశర్మ |
పంపిణీదార్లు | యన్.టి.ఆర్. ఆర్ట్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కళ్యాణ్ రామ్ కత్తి 12 నవంబరు 2010 న విడుదలైన తెలుగు చిత్రం. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, సనా ఖాన్, షామ్, శరణ్య మోహన్, కోట శ్రీనివాసరావు తదితరులు నటించారు. ఈ కథను వక్కంతం వంశీ రాయగా, మల్లికార్జున్ స్క్రీన్ ప్లే రాశాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అభిమన్యు తరువాత కళ్యాణ్ రామ్, మల్లికార్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. సనా ఖాన్ తొలి సినిమా. తన సోదరి తప్పిపోయినప్పుడు, హింసాత్మక వైపు వెళ్ళే ఒక ఫుట్ బాల్ ఆటగాడి కథ ఇది.[1]
సినిమా విడుదలకు ముందే, చిత్ర దర్శకుడు నమోదు చేసిని సినిమా పేరుకు సంబంధించి ఒక వివాదం జరిగింది. రవితేజ హీరోగా గుణశేఖర్ తీసిన సినిమాకు కత్తి అని పేరు పెట్టుకోగా, టైటిల్‌ను కత్తి నుండి కళ్యాణ్ రామ్ కత్తిగా మార్చారు, ఆ తరువాత గుణశేఖర్ టైటిల్‌ను వదులుకున్నాడు.[2][3] ఈ సినిమా పరాజయం పొందింది.[4]
ఈ సినిమాకి మణిశర్మ సంగీతం సమకూర్చారు. మయూరి ఆడియో పాటలు విడుదల చేసింది. ఆడియో విడుదల కార్యక్రమం 2010, నవంబరు 6న తాజ్ బంజారా హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, జానకిరాం, తారక రత్న, షామ్, కోటా శ్రీనివాసరావు, సన ఖాన్, మల్లికార్జున్, గౌతంరాజు, వక్కంతం వంశీ, ఆర్పీ పట్నాయక్, శ్రీవాస్, రఘుబాబు విచ్చేసారు.[5]
Untitled | |
---|---|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "జై జై రామ్ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | విజయ్ యేసుదాస్ | 4:18 | ||||||
2. | "ఏమి దెబ్బరో (రచన: రామజోగయ్య శాస్త్రి)" | ఖుషి మురళి | 4:01 | ||||||
3. | "నాటు కోడి కూర (రచన: బండారు దానయ్య)" | హేమచంద్ర, గీతా మాధురి | 4:06 | ||||||
4. | "ఏమవుతుంది గుండెలో (రచన: బాలాజీ)" | శ్రీరామచంద్ర | 4:15 | ||||||
5. | "థీమ్ ఆఫ్ కళ్యాణ్ రామ్" (వాయిద్యం) | 02:28 | |||||||
19:08 |