కళ్ళం సతీష్ రెడ్డి | |
---|---|
విద్యాసంస్థ | పర్డ్యూ విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం |
వృత్తి | డా. రెడ్డీస్ ల్యాబ్స్ ఛైర్మన్[1] |
బంధువులు | కళ్ళం అంజిరెడ్డి (తండ్రి) |
కళ్ళం సతీష్ రెడ్డి ఒక వ్యాపారవేత్త, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రస్తుత ఛైర్మన్.[2][3] 1993లో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరిన సతీష్ రెడ్డి, 1997లో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎదిగాడు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల తయారీదారు నుండి పూర్తి మోతాదు సూత్రీకరణల విభిన్న ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోతో కంపెనీకి మారడానికి నాయకత్వం వహించాడు. రష్యా, సిఐఎస్ దేశాలు, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తుల మార్కెటింగ్ కు బాధ్యత వహించాడు.[4][5]
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో బిఎస్, పర్డ్యూ విశ్వవిద్యాలయం నుండి మెడిసినల్ కెమిస్ట్రీలో ఎంఎస్ పట్టా పొందాడు.[6]
2019, అక్టోబరు 10న ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.[7] భారతదేశం అంతటా లైఫ్ సైన్సెస్ రంగంలో నైపుణ్యం లోపాలను పరిష్కరించడానికి కృషి చేస్తున్ననేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోని లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కి ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్నాడు.[8]హైదరాబాదులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్[9] బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదరన్ రీజియన్‌కు డిప్యూటీ చైర్‌గా, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఛైర్మన్, ఫార్మాస్యూటికల్స్ నేషనల్ కమిటీకి అధిపతిగా కూడా ఉన్నాడు. 2015 మేలో భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా నామినేట్ అయ్యాడు.[10] లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు ఛైర్మన్‌గా కూడా ఉన్నాడు.
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా పనిచేస్తున్న సతీష్, ఆ సంస్థ ద్వారా తక్కువ ప్రాధాన్యత కలిగిన వారికి తగిన వృత్తి విద్య ద్వారా స్థిరమైన జీవనోపాధిని కల్పించడంలో సహాయం చేస్తున్నాడు. బాలల హక్కులు, విద్య, సురక్షితమైన తాగునీరు, వ్యవసాయం ఎగుమతి మార్కెటింగ్ మద్దతు, ఇతర సాధికారత కార్యక్రమాలలో పనిచేసే నంది ఫౌండేషన్ కు ట్రస్టీగా ఉన్నాడు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్,[11] సతీఫ్ రెడ్డిని "యంగ్ గ్లోబల్ లీడర్ ఫర్ 2007"గా గుర్తించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి చేసిన సేవలకుగాను 2005లో సి.ఎన్.బి.సి. ద్వారా ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డును ప్రదానం చేసింది.[12]
{{cite web}}
: |first=
has generic name (help)