కశ్యప సంహిత ఆయుర్వేద వైద్య గ్రంధాలలో మొట్టమొదటిది. దీనిని 'వృవాజికాయంత్రికాంత', 'జీవకీయ తంత్రము' అని కూడా అంటారు. ఆయుర్వేదంలోని ఎనిమిది గ్రంథాలలో కశ్యప సంహిత అత్యంత ముఖ్యమైంది.
ఇది క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దంలో కూర్చబడింది. ఈ గ్రంథం ప్రధానంగా అష్టాంగ ఆయుర్వేదంలోని కౌమరభృత్య శాఖకు అంకితం చేయబడింది. కౌమరభృత్యుల పట్ల ఉన్న శ్రద్ధ, ఈ గ్రంథ రచనల్లో శాస్త్రీయ దృష్టితో విపులంగా వివరించారు.[1]
ఇది అన్ని ఆయుర్వేద సంహిత గ్రంథాలలోకెల్లా పురాతనమైనది . బ్రహ్మ నుండి దక్షప్రజాపతికీ, తర్వాత వరుసగా అశ్వినీ కుమారులకు, ఇంద్రునికి, కశ్యపునికీ, వశిష్ఠునికీ, అత్రికీ, భృగు మహర్షులకు ఈ కశ్యప సంహితా విజ్ఞానము అందింది. కశ్యపుని కుమారుడు, ఆతని అనుయాయులు ఈ మేధాసంపత్తిని తరువాతి తరాలవారికి అందజేశారు.
మధ్య యుగాలలో కశ్యప సంహిత ను చైనాభాషలోకి అనువదించారు.[2]
ప్లేటో రచన "ది రిపబ్లిక్" లోని శైలిలాగానే 'కశ్యప సంహిత' ప్రశ్నోత్తరముల రూపములో ఉంది. వ్యాధి సంబంధిత ప్రశ్నలు, వాటి నిర్ధారణ, వాటి చికిత్స, యాజమాన్యాల కు సంబంధించి విద్యార్థుల ద్వారా లేవనెత్తబడ్డ ప్రశ్నలకు కశ్యప అనే మహర్షి సమాధానం చెప్పారు. కౌమార భృత్యము పైన పేర్కొన్న బాలారిష్టముల వలననే ఆయుర్వేదపరంగా, విద్యాపరంగాను, జన బాహుళ్యములో గుర్తింపుకు వెనుకంజలో ఉంది.
కౌమారభృత్యమును ప్రధాన ఇతివృత్తంగా చేసికొని రచించిన గ్రంథం అందుకనే ప్రతి అంశము బాలుడు, ధాత్రికి సంబంధించినదై ఉంటుంది. ఈ సంహితలో లేహనవిధి, రేవతీ గ్రహము, ధూపనకల్పము, మాతంగ విద్య మొదలగునవి ప్రత్యేకముగా విపులీకరించబడినవి. ప్రసూతి వైద్యంలో కశ్యపుని కృషి గణనీయమైనది. [3]
కశ్యపుడు తన సంహితలో కన్యత్వం, గర్భధారణ , యాంటిపైరేటిక్, స్త్రీ వ్యాదుల పరిచయం, పరీక్షల గురించి వివరించాడు. పిల్లల పెరుగుదలకు సంబధించిన ఎన్నో సూచనలను తన గ్రంథంలో అందించాడు.ఇందులో కన్యత్వానికి, పిల్లలలో పుట్టుక నుండి, దంతవైద్యం, యుక్తవయస్సు వరకు వచ్చే ఇతర వ్యాధుల గురించి , పంచకర్మ అధ్యాయం కింద, పిల్లలలో చేసే పంచకర్మ , ముందు జాగ్రత్త ,శస్త్రచికిత్సల వివరణాత్మక వర్ణన ఉంది.
కశ్యప సంహితలో 200 అధ్యాయాలున్నాయి.కశ్యప సంహిత ఇతివృత్తం దాని ప్రణాళిక చారక సంహిత మాదిరిగానే ఉంటుంది. కుమారభూతకు సంబంధించి కొత్త విషయాలను కశ్యపసంహిత ప్రస్తావించింది. కాయ చికిత్స, శల్య చికిత్స, శాలక్య తంత్ర, అగాధ తంత్రం, భూత విద్య , కౌమార భృత్య, రసాయన తంత్రం, వాజీకరణ తంత్రం అనే ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని విభాగాలలో కశ్యపప్రభావం ఉంది.
కశ్యపుని వైద్య విధానంలో ఏడు విధాలుగా మందులను తయారు చేసేవారట ఆవి
1. చూర్ణం
2. శీతకషాయం
3. స్వరస
4. అభిసవ
5. ఫంట
6. కలక
7. క్వత