కహిని | |
---|---|
దర్శకత్వం | మలయ్ భట్టాచార్య |
రచన | మలయ్ భట్టాచార్య |
నిర్మాత | చంద్రమాల భట్టాచార్య, మలయ్ భట్టాచార్య |
తారాగణం | ధృతిమాన్ ఛటర్జీ, రబీ ఘోష్, దేబేష్ రాయ్ చౌదరి, దేబాషిష్ గోస్వామి |
ఛాయాగ్రహణం | సన్నీ జోసఫ్ |
కూర్పు | అర్ఘ్యకమల్ మిత్ర |
సంగీతం | దేవజ్యోతి మిశ్రా |
విడుదల తేదీ | 1997 |
సినిమా నిడివి | 105 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ భాష |
కహిని, 1997 అక్టోబరు 17న విడుదలైన బెంగాలీ సినిమా.[1] మూవీ మిల్ బ్యానరులో చంద్రమాల భట్టాచార్య, మలయ్ భట్టాచార్య నిర్మించిన ఈ సినిమాకు మలయ్ భట్టాచార్య దర్శకత్వం వహించాడు.[2][3] దర్శకుడి ఉత్తమ తొలి చిత్రంగా 43వ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది.[4]
రజత్ ఒక పిల్లవాడిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుంటాడు. దానికోసం ఒక వ్యక్తి రజత్ కు కొన్ని పేపర్లు, పిల్లల సగం కాలిపోయిన ఫోటోను ఇస్తాడు. కిడ్నాప్ చేసిన పిల్లలతో రజత్, పేయింటర్, టాక్సీ డ్రైవర్ తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. కాని వారికి అనుకోని పరిస్థితులు ఎదురౌతాయి. పిల్లల శారీరక పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది.