కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి), భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యనిర్వాహక కమిటీ. 1920 డిసెంబరులో నాగపూరులో జరిగిన కాంగ్రెసు పార్టీ సమావేశాల్లో సి. విజయరాఘవాచారియర్ నేతృత్వంలో దీన్ని ఏర్పరచారు. ఇది పార్టీ సీనియర్ నాయకులతో కూడి ఉంటుంది. ముఖ్యమైన విధానం, సంస్థాగత విషయాలపై నిర్ణయాలు తీసుకోవడం, జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలకు మార్గనిర్దేశం చేయడం దీని బాధ్యతలు. ఇందులో సాధారణంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) నుండి ఎన్నికైన పదిహేను మంది సభ్యులు ఉంటారు. సిడబ్ల్యుసికి పార్టీ అధ్యక్షుడు నాయకత్వం వహిస్తారు. పార్టీ కేంద్ర పాలకమండలి అయిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు.
వర్కింగ్ కమిటీ వివిధ సమయాల్లో పార్టీలో వివిధ స్థాయిల్లో అధికారాలు ఉండేవి. స్వాతంత్ర్యం రావడానికి ముందు, వర్కింగ్ కమిటీ అధికార కేంద్రంగా ఉండేది. కాంగ్రెస్ అధ్యక్షుడి కంటే వర్కింగ్ ప్రెసిడెంట్ చురుకుగా ఉండేవారు. 1967 తర్వాత కాలంలో, కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా చీలిపోయినప్పుడు (ఇందిరాగాంధీకి విధేయులైన వర్గానికీ, కామరాజ్, ప్రఫుల్ల చంద్ర సేన్, అజోయ్ ముఖర్జీ, మొరార్జీ దేశాయ్ వంటి నాయకులతో కూడిన ప్రాంతీయ నాయకుల సిండికేట్ ల మధ్య చీలిపోయింది) వర్కింగ్ కమిటీ ఆధిపత్యం క్షీణించింది. కానీ 1971 లో ఇందిరా గాంధీ విజయం సాధించాక, రాష్ట్రాల నుండి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుండి అధికారం తిరిగి కేంద్రీకృతమైంది. ఢిల్లీలోని వర్కింగ్ కమిటీ మరోసారి పార్టీకి ప్రధాన నిర్ణయాధికార సంస్థగా మారింది.[1] కాంగ్రెస్ నిర్ణయాధికారంలో ఉండే కేంద్రీకృత స్వభావం అప్పటి నుండి రాష్ట్రాలలోని పరిశీలకులు ఢిల్లీ నుండి వచ్చిన ఆదేశాలు "హైకమాండ్" నుండి వచ్చినట్లు చెప్పడం పరిపాటి అయింది.
అధ్యక్షుడు
పేరు | చిత్తరువు | ప్రభుత్వంలో స్థానం |
---|---|---|
మల్లికార్జున్ ఖర్గే | ![]() |
|
సభ్యులు [5]
ఎస్. లేదు | సభ్యుడు | చిత్తరువు | ప్రభుత్వంలో స్థానం |
---|---|---|---|
1. | సోనియా గాంధీ | ![]() |
|
2. | మన్మోహన్ సింగ్ | ![]() |
|
3. | రాహుల్ గాంధీ | ![]() |
|
4. | ఎ. కె. ఆంటోనీ | ![]() |
|
5. | అంబికా సోనీ | ![]() |
|
6. | అభిషేక్ సింఘ్వీ | ![]() |
|
7. | అధీర్ రంజన్ చౌదరి | ![]() |
|
8. | అజయ్ మాకెన్ | ![]() |
|
9. | ఆనంద్ శర్మ | ![]() |
|
10. | జైరామ్ రమేష్ | ![]() |
|
11. | గైఖంగం గంగ్మై |
| |
12. | జితేంద్ర సింగ్ | ![]() |
|
13. | సెల్జా కుమారి |
| |
14. | లాల్ తన్హావ్లా | ![]() |
|
15. | ముకుల్ వాస్నిక్ | ![]() |
|
16. | చరణ్జిత్ సింగ్ చన్నీ | ![]() |
|
17. | ప్రియాంక గాంధీ వాద్రా | ![]() |
|
18. | పి. చిదంబరం | ![]() |
|
19. | రణదీప్ సుర్జేవాలా | ![]() |
|
20. | ఎన్. రఘువీరా రెడ్డి |
| |
21. | తారిక్ అన్వర్ | ![]() |
|
22. | సచిన్ పైలట్ | ![]() |
|
23. | తామ్రధ్వజ్ సాహు |
| |
24. | శశి థరూర్ | ![]() |
|
25. | సల్మాన్ ఖుర్షీద్ | ![]() |
|
26. | దిగ్విజయ్ సింగ్ | ![]() |
|
27. | దీపక్ బబరియా |
| |
28. | మీరా కుమార్ | ![]() |
|
29. | జగదీష్ ఠాకూర్ |
| |
30. | గులాం అహ్మద్ మీర్ |
| |
31. | అవినాష్ పాండే |
| |
32. | దీపా దాస్మున్షి | ![]() |
|
33. | గౌరవ్ గొగోయ్ |
| |
34. | సయ్యద్ నసీర్ హుస్సేన్ |
| |
35. | కమలేశ్వర్ పటేల్ | ![]() |
|
36. | కె. సి. వేణుగోపాల | ![]() |
|
ఎస్. నో | సభ్యుడు | చిత్తరువు | స్థానం |
---|---|---|---|
1. | ప్రతిభా సింగ్ | ఎంపీ లోక్‌సభ మండి | |
2. | పవన్ కుమార్ బన్సాల్ | మాజీ ఎంపీ, (చండీగఢ్) | |
3. | వీరప్ప మొయిలీ | ![]() |
మాజీ ఎంపీ, (కర్ణాటక) |
4. | హరీష్ రావత్ | ![]() |
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి |
5. | మోహన్ ప్రకాష్ | రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే | |
6. | రమేష్ చెన్నితల | ![]() |
కేరళ ఎమ్మెల్యే |
7. | బి. కె. హరిప్రసాద్ | ఎంఎల్సి, కర్ణాటకకర్ణాటక | |
8. | మనీష్ తివారీ | ![]() |
ఎంపీ, పంజాబ్ |
9. | తారిఖ్ హమీద్ కర్రా | మాజీ ఎంపీ, జమ్మూ & కాశ్మీర్ | |
10. | దీపేందర్ సింగ్ హుడా | ![]() |
ఎంపీ, హర్యానా |
11. | గిరీష్ చోడంకర్ | ||
12. | టి. సుబ్బరామారెడ్డి | ![]() |
మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ |
13. | కె. రాజు | ||
14. | చంద్రకాంత్ హందోర్ | మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే | |
15. | మీనాక్షి నటరాజన్ | ![]() |
మాజీ ఎంపీ, మధ్యప్రదేశ్ |
16. | ఫులో దేవి నేతమ్ | ఎంపీ, ఛత్తీస్గఢ్ | |
17. | దామోదర్ రాజా నరసింహ | తెలంగాణ క్యాబినెట్ మంత్రి | |
18. | సుదీప్ రాయ్ బర్మన్ | ![]() |
త్రిపుర ఎమ్మెల్యే |
సభ్యుడు | పార్టీ స్థానం |
---|---|
జి. సంజీవ రెడ్డి | అధ్యక్షుడు, INTUC |
నీరజ్ కుందన్ | అధ్యక్షుడు, NSUI |
బివి శ్రీనివాస్ | అధ్యక్షుడు, IYC |
లాల్జీ దేశాయ్ | చీఫ్ ఆర్గనైజర్, సేవాదళ్ |
గిడుగు రుద్రరాజు | ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు |
చింతా మోహన్ | మాజీ ఎంపీ |
సచిన్ రావు | శిక్షణ ఇంచార్జి |
కాంగ్రెస్ దాదాపు 20 సంవత్సరాలుగా సిడబ్ల్యుసికి అంతర్గత ఎన్నికలు నిర్వహించలేదు. చివరి ఎన్నికలు 1998లో జరిగాయి [6] అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని 2017లో ఎన్నికల సంఘం ఆదేశించింది.[7] కానీ 2020 నాటికి ఎన్నికలు జరగలేదు.[8] 2019 లో మహారాష్ట్రలో సైద్ధాంతికంగా శివసేనతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నప్పుడు, కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్, సిడబ్ల్యుసిని రద్దు చేయాలని సోనియా గాంధీని బహిరంగంగా కోరుతూ "ఇకపై వారిని విశ్వసించలేము" అన్నాడు.[9][10] 2020 లో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రచురించిన ఒక పత్రంలో సిడబ్ల్యుసి సభ్యులలో చాలామంది "స్వార్థమే పరమార్థంగా ఉన్న విలువలు లేని, అవకాశవాదులు" అని వర్ణించింది.[11]