కాంచీవరం

కాంచీవరం
దర్శకత్వంప్రియదర్శన్
రచనప్రియదర్శన్
నిర్మాతశైలేంద్ర సింగ్
భూషణ్ కుమార్
తారాగణంప్రకాష్ రాజ్
శ్రియా రెడ్డి
షమ్ము
ఛాయాగ్రహణంతిరు
కూర్పుఅరుణ్ కుమార్
సంగీతంఎం. జి. శ్రీకుమార్
నిర్మాణ
సంస్థలు
పర్సెప్ట్ పిక్చర్ కంపెనీ
ఫోర్ ఫ్రేమ్స్ పిక్చర్స్
విడుదల తేదీs
12 సెప్టెంబరు 2008 (2008-09-12)(Toronto International Film Festival)
13 మార్చి 2009 (India)
సినిమా నిడివి
117 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతమిళం

కాంచీవరం 2008లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రధారులు. ఎం. జి. శ్రీకుమార్ సంగీత దర్శకత్వం వహించాడు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో కాంచీపురంలో ఉన్న నేత కార్మికుల దయనీయ స్థితిని ఈ చిత్రంలో చూపించారు. కాంచీపురంలో సహకార చేనేత ఉద్యమం ఎందుకు ప్రారంభమైందో చెబుతూ సినిమా ముగిస్తారు. సినిమా కాంచీపురం నేపథ్యంలో తీసినా ప్రధానంగా ఈ సినిమాను మైసూరులో చిత్రీకరించారు.

2007 లో ఈ సినిమా సెన్సారు పూర్తి చేసుకుంది. దీనికి యూ సర్టిఫికెట్ లభించింది. 2008 లో 33వ టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా సెప్టెంబరు 12, 2008 న విడుదల చేశారు.[1] పిట్స్ బర్గ్ లో జరిగిన సిల్క్ స్క్రీన్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. తర్వాత ఈ సినిమాకు ఉత్తమ జాతీయ చిత్రంగా, ప్రకాష్ రాజ్ కు ఉత్తమ నటుడిగా 55వ జాతీయ చలనచిత్రోత్సవాల సందర్భంగా అవార్డులు ప్రకటించారు. ప్రియదర్శన్ కు ఉత్తమ దర్శకుడిగా జెనిత్ ఆసియా పురస్కారాన్ని ప్రధానం చేశారు.

ఈ సినిమాను మొదట్లో మోహన్ లాల్ కథానాయకుడిగా, ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకుడిగా మలయాళంలో తీయాలనుకున్నారు.[2] కానీ మోహన్ లాల్ డేట్లు కుదరక పోవడం వల్ల అది కుదరలేదు.[3]

అది 1948వ సంవత్సరం. వేంగడం (ప్రకాష్ రాజ్) జైలు నుంచి అప్పుడే జైలు నుంచి తీసుకువస్తుంటారు. అతనికి ఇద్దరు పోలీసులు రక్షణగా ఓ బస్సులో తీసుకు వచ్చి అతని స్వస్థలమైన కాంచీపురానికి తీసుకువస్తారు. ఆ బస్సులో తీసుకు వచ్చేటపుడు అప్పుడప్పుడు అతని గతం గుర్తుకు వస్తుంది.

వేంగడం కాంచీపురంలో పట్టుబట్టలు నేసే కార్మికుడు. అతనికి అప్పుడే కొత్తగా అన్నం (శ్రియా రెడ్డి) పెళ్ళై ఉంటుంది. పెళ్ళి కాక మునుపు ఓ సారి తాను పట్టుచీర కట్టుకున్న అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని అనుకుని ఉంటాడు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మామూలు బట్టలతోనే సరిపెట్టుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత అతని చెల్లెలు భర్త తన వ్యాపారంలో బాగా నష్టం వచ్చిందనీ, అతని చెల్లెల్ని పోషించలేనని చెప్పడంతో చెల్లెలు కాపురాన్ని బాగు చేయడం కోసం, ఆమె పరువు కాపాడటం కోసం వేంగడం అప్పటి దాకా తాను దాచుకున్న సొమ్మంతా బావకిచ్చేస్తాడు. దాంతో భార్యకు పట్టుచీర కొనాలన్న కోరిక మళ్ళీ అటకెక్కుతుంది. మరి కొద్ది రోజులకు వాళ్ళ ఊరికి ఓ రచయిత వస్తాడు. అతను ఉండటానికి ఎక్కడైనా స్థలం చూపించమనడంతో వేంగడం తన స్నేహితుడిల్లు చూపిస్తాడు. నిజానికి రచయిత కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాడు. అక్కడి నేత కార్మికులు అణిచివేతకు గురవుతున్నారనీ, వాళ్ళకు సరిపడా జీత భత్యాలు అందడం లేదనీ, కనీసం వారు నేసిన బట్టలే వారు కట్టుకోలేక పోతున్నారనీ అందరినీ చైతన్య పరుస్తూ ఉంటాడు. కొంతకాలానికి వేంగడం, మరికొంతమందితో కలిసి అతన్ని సమర్ధించడం ప్రారంభిస్తారు. వాళ్ళందరినీ పనిలో పెట్టుకుని నేత వ్యాపారం సాగిస్తున్న జమీందారు మీద వ్యంగ్యంగా వీధి నాటకాలు వేయడం మొదలు పెడతారు. కొద్ది రోజులకు ప్రజల్లో అశాంతిని రేపుతున్నాడని కారణంగా పోలీసులు ఆ రచయితను కనిపెట్టి మట్టుపెడతారు. దాంతో ఆ ఉద్యమం వేంగడం చేతుల్లోకి వెళుతుంది. అతని సారథ్యంలో చేనేత కార్మికులంతా కలిసి తమ వేతనాలు పెంచాలనీ పిటిషను దాఖలు చేస్తారు.

కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడి కొడుకు ఒకడు సైన్యం నుంచి తిరిగి వస్తాడు. అతన్ని వేంగడం కూతురు ప్రేమిస్తుంటుంది. అతను బ్రిటిష్ వారు యుద్ధంలో జర్మన్లను ఓడించబోతున్నారనీ కమ్యూనిస్టులకు కాలం చెల్లబోతోందనీ చెబుతాడు. తాను మళ్ళీ యుద్ధానికి వెళ్ళే లోపు వేంగడం కూతురును వివాహం చేసుకోవాలంటాడు. వేంగడం కనీసం తన కూతురినైనా పట్టుచీరతో సాగనంపాలని అనుకుంటాడు. కానీ అప్పటికి సగం చీరే పూర్తి చేసి ఉంటాడు. జమీందారు మీద తిరుగుబాటు చేసి పని ఆపేసిన అందరినీ మళ్ళీ పనిలో చేరమంటాడు. దాంతో అందరూ అతన్ని మోసగాడిగా ముద్ర వేస్తారు. తాను పనిచేసే గుడి నుంచి కొద్ది కొద్దిగా పట్టు పోగులు దొంగతనంగా ఎత్తుకొచ్చె చీర నేస్తుంటాడు. కానీ కొద్ది రోజుల తర్వాత దొరికిపోయిన అతన్ని కొట్టి జైలుకు పంపిస్తారు.

కథ మళ్లీ ప్రస్తుతానికి వస్తుంది. అతని కూతురు పొరపాటున కాలు జారి బావిలో పడిపోయి పక్షవాతానికి గురై ఉంటుంది. ఆ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే ఆమె తల్లి జమీందారు కొత్త కారును చూడ్డానికి వెళ్ళిన జనాల తొక్కిసలాటలో మరణించి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసుకోవడానికి కూడా ఎవరూ ఉండరు. దాంతో వేంగడం తన చెల్లెల్ని పిలిచి ఆ అమ్మాయిని తన ఇంట్లో ఉంచమంటాడు. కానే ఆమె ఓ దొంగ కూతురు తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదని ఖరాకండీగా చెబుతుంది. వేంగడం ఏమి చేయాలో పాలుపోక కన్నకూతురికే విషమిచ్చి చనిపోయేలా చేస్తాడు. కూతురు శవాన్ని ఇంటి ముందు ఉంచి లోపలికి వెళ్ళి తాను సగంలో ఆపేసిన చీరను ఆమెకు పూర్తిగా కప్పాలని అన్ని విధాల ప్రయత్నిస్తాడు. పోలీసులు వచ్చి ఇంక సమయమైందని చెప్పగానే వెర్రి చూపులు చుస్తూ పిచ్చి నవ్వు నవ్వుతాడు.

తారాగణం

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
  • జాతీయ చలన చిత్ర పురస్కారాలు
    • జాతీయ ఉత్తమ చిత్రం
    • జాతీయ ఉత్తమ నటుడు (ప్రకాష్ రాజ్)[4][5]
  • దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారారాలు
  • ఇతర పురస్కారాలు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-09-10. Retrieved 2016-11-25.
  2. http://www.rediff.com/movies/2001/oct/17priya.htm
  3. http://www.indiaglitz.com/mohanlal-was-supposed-to-do-kanchivaram-priyan-malayalam-news-49791
  4. "Southern films score big at National Awards". The Hindu. 7 September 2009. Archived from the original on 10 September 2009. Retrieved 2009-09-07.
  5. http://www.frontlineonnet.com/stories/20091009262009200.htm

బయటి లింకులు

[మార్చు]
External video
తమిళంలో యూట్యూబ్లో