కాంతారా | |
---|---|
దర్శకత్వం | రిషబ్ శెట్టి |
రచన | రిషబ్ శెట్టి |
నిర్మాత | విజయ్ కిరగందూర్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అరవింద్ ఎస్ కశ్యప్ |
కూర్పు | కే. ఎం. ప్రకాష్ ప్రతీక్ శెట్టి |
సంగీతం | బి. అజనీష్ లోక్‌నాథ్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ |
విడుదల తేదీ | 2022 అక్టోబర్ 15 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 16 కోట్లు |
బాక్సాఫీసు | 400 కోట్లు[1] |
కాంతారా 2022లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. రిషబ్ శెట్టి, కిషోర్‌కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమిగౌడ, ప్రమోద్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై, తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది.[2] రిషభ్ శెట్టి నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది.[3]
18వ శతాబ్దంలో మొదలైన ఈ కథ 90దశకంలోకి ప్రవేశించి గ్రామానికి చెందిన దొర కుటుంబం (అచ్యుత్ కుమార్) తరతరాలుగా పల్లె ప్రజలకు అండగా ఉంటూ వాళ్లకు సమస్యలు వస్తే ముందు నిలుచుంటాడు. ఆయనకి అదే గ్రామానికి చెందిన శివ(రిషబ్ శెట్టి) కొన్ని పనుల్లో దొరకు సహాయంగా ఉంటాడు. ఈ క్రమంలో ఆ గ్రామానికి ఫారెస్ట్ అధికారిగా మురళీ (కిశోర్) వస్తాడు.
కొన్నేళ్ల తర్వాత ఆ భూమి రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమని, దానిని ఊరి ప్రజలు ఆక్రమించుకున్నారని ఫారెస్ట్ ఆఫీసర్ (కిశోర్) సర్వే చేస్తుంటాడు. ఊరిలో యువకుడు శివ (రిషబ్ శెట్టి)కి, ఫారెస్ట్ ఆఫీసర్‌కి గొడవలు కూడా అవుతాయి. ఈ క్రమంలోనే అనుకోని సంఘటన జరిగి శివ జైలుకు వెళ్తాడు. శివ జైల్లో ఉన్న సమయంలో అతడి మిత్రుడు గురువా (స్వరాజ్ శెట్టి) హత్యకు గురవుతాడు. ఇంతకీ హత్య చేసింది ఎవరు? తన గ్రామం కోసం భూమిని శివ కాపాడుకున్నాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4][5]
ఇందులో భూతకోల దేవతలు కూడా చిత్రీకరించబడ్డారు.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)